Allu Sneha Reddy: స్నేహారెడ్డి కాలినడకన తిరుపతికి వెళ్లడానికి అసలు కారణమిదే.. త్వరలో శుభవార్త చెప్పనున్నారా?

Allu Sneha Reddy: పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తాజాగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా వచ్చిన స్నేహ రెడ్డి ని చూసి బన్నీ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. పక్కన అల్లు అర్జున్ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లేకుండా ఆవిడ మాత్రమే వచ్చి సాధారణ మహిళ మాదిరిగా దీపాలు వెలిగిస్తూ, మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం చూసిన భక్తులు మీరు గ్రేట్ మేడం అని పొగుడుతున్నారు.

అయితే అల్లు అర్జున్ పుష్ప టు షూటింగ్లో బిజీగా ఉండడం మూలంగా తిరుపతికి రాలేనట్లు సమాచారం. అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనదైన శైలిలో అభిమానులకు చేరువలో ఉండే స్నేహ రెడ్డికి విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి స్నేహారెడ్డి ఒక సామాన్య భక్తురాలిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామికి ముక్కు చెల్లించుకున్నారు. దీని వెనక కారణం ఏమైనా ఉందా అంటూ అప్పుడే సెర్చింగులు మొదలుపెట్టారు నెటిజెన్స్.

అయితే ఆమె త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందని, తన కోరిక నెరవేరుతున్నటువంటి నేపథ్యంలోనే స్వామివారికి ముక్కు చెల్లించుకున్నారని ఒక వార్త వైరల్ గా మారింది. స్నేహ రెడ్డికి ఎప్పటినుంచో హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగాలని కోరికగా ఉండేదట, అయితే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మొదట్లో వద్ద ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు మాత్రం ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావటానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది.

ఇదే గనక నిజమైతే ఈమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ త్వరలోనే జరగబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే కారణం ఇది కాదంటూ మరొక వాదన బలంగా వినబడుతుంది. తన భర్తకు నేషనల్ అవార్డు రావడంతో ఆనందించిన స్నేహ రెడ్డి ఇలా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారని వార్తలు వస్తున్నాయి. విషయం ఏదైనాప్పటికీ అంత స్థాయిలో ఉన్న ఒక మహిళ ఎలాంటి భేషజం,ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బయటికి రావడం అనేది నిజంగా మెచ్చుకోవలసిన విషయమే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -