Director Shankar: శంకర్ అప్పట్లో సక్సెస్ కావడానికి ఇప్పుడు ఫెయిల్ కావడానికి కారణం ఆయనేనా?

Director Shankar: సినీ ప్రియులకు డైరెక్టర్ శంకర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారీ స్థాయికి శంకర్ సినిమాలు ఒక చక్కని ఉదాహరణగా అనిపిస్థాయి. అంతేకాకుండా ఆకాశాన్ని అందే అంత భారీ సెట్స్ తో శంకర్ సినిమా నిర్మితమవుతుంది. ఇక నటీనటులు ను గుర్తుపట్టని రీతిలో శంకర్ సినిమాలో మేకప్ లు ఉంటాయి. ఇలా భారతీయ చిత్రాలను హాలీవుడ్ రేంజ్ లో ప్రాణం పోస్తాడు శంకర్.

ఇలా శంకర్ అగ్రస్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక టెక్నాలజీ పరంగా టాప్ స్థాయిలో ఉండడమే కాదు. తన కథలతో ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తాడు శంకర్. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో శంకర్ తీసే సినిమాల్లో భారీ స్థాయిలో సెట్స్ కనబడుతున్నాయి కానీ ఆ సినిమాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ పూర్తిగా మిస్ అవుతుంది. ఇక ఇటీవల తీసిన రోబో 2.0 సినిమాలో కూడా ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది.

ఇండియాలో ప్రౌడ్ గా ఫీల్ అయ్యే గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఈ కథ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. కాగా 2.0 సినిమా ప్రేక్షకులకు అంతగా తట్టలేదు. ఇక ఇలాంటి కనెక్టివిటీ లేకపోవడానికి కారణం శంకర్ కాదు. దానికి కారణం సుజాత రంగరాజన్. అవును శంకర్ దర్శకత్వంలో విడుదలైన అన్ని సినిమాలకు సుజాత రంగరాజన్ రచయితగా పనిచేశాడు. రోబో సినిమా తర్వాత రంగరాజన్ చనిపోయాడు.

ఆ తర్వాత శంకర్ తీసే సినిమాల్లో భారీ స్థాయిలో అద్భుతమైన కంటెంట్ ఉన్నప్పటికీ తనకి సుజాత రంగరాజన్ లాంటి రచయితలేడు. కాబట్టి శంకర్ ఇటీవల తీసిన సినిమాలన్నీ పూర్తిగా డిజాస్టర్ అయ్యాయి. సుజాత రంగరాజన్ చనిపోయిన తర్వాత శంకర్ త్రీ ఇడియట్ సినిమాను రీమేక్ చేశాడు. ఈ సినిమా పూర్తిగా పరాజయపాలైంది. దీనిని బట్టి అర్థమవుతుంది శంకర్ కు సుజాత రంగరాజన్ లేని లోటు బాగా కనబడుతుందని. మరి ఈయన లాంటి మరో రచయిత శంకర్ కెరియర్ లో వస్తాడో రాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -