Renu Desai: రెండో పెళ్లి అప్పుడే చేసుకుంటా.. పవన్ కు షాకిచ్చిన రేణు.. ఏం చెప్పారంటే?

Renu Desai: బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ కి రీల్ హీరోయిన్ గా నటించి తర్వాత రియల్ హీరోయిన్ అయిన నటి రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ కి రెండవ భార్య అయిన రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి గురించి వైరల్ కామెంట్స్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ వెండి తెర మీద కనిపిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ భామ నుపూర్ సనన్ హీరోయిన్ గా రవితేజ హీరోగా నటిస్తున్నారు.

అందులో ఒక కీలక పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతుంది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జానీ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు రేణు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడింది రేణు దేశాయ్.

నా వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను కానీ నన్ను తప్పు పట్టకూడదని ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అందరి అంగీకారంతోనే ఆరోజు నిశ్చితార్థం జరిగింది కానీ అప్పటికి నా కూతురు వయసు ఏడేళ్లు. నేను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే తను ఏం కావాలి అందుకే పెళ్లి రద్దు చేసుకున్నాను. ఇప్పుడు నా కూతురు వయసు 13 సంవత్సరాలు.

ఇప్పుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కానీ మరొక రెండేళ్ల ఆగాల్సిన అవసరం ఉంది. ఆద్య కాలేజీకి వెళ్ళాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకి కూడా ఇష్టమే. ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటాను అని నీకు అనిపిస్తే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని అఖీరా, ఆధ్య ఇద్దరూ చెప్పారు. కాబట్టి రెండేళ్ల తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చారు రెండు దేశాయ్.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -