Renu Desai: పుట్టడమే గుండెజబ్బుతో పుట్టాను.. పవన్ మాజీ భార్య కన్నీటి కష్టాలు వింటే షాకవ్వాల్సిందే!

Renu Desai:  ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. వస్తూనే ఆమె మాటల్ని కాంట్రవర్సీలకి గురి చేస్తున్నారు పవన్ అభిమానులు. పవన్ సీఎం అవటంపై తన అభిప్రాయాన్ని చెప్పడంతో పవన్ అభిమానులు ఆమెపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అందుకు పవన్ అభిమానులు ఇంకా మారలేదు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అంటూ తన బాధని వెళ్లగక్కింది రేణు దేశాయ్.

అలాగే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఆరోగ్య సమస్య గురించి కూడా చెప్పుకొచ్చింది. తను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, తనకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉంది అని గతంలోనే సోషల్ మీడియాలో వెల్లడించారు రేణు దేశాయ్. అయితే దాని గురించి ఇప్పుడు విపులంగా చర్చించారు. తన అనారోగ్యం గురించి ఈ విధంగా మాట్లాడారు రేణు దేశాయ్, పుట్టుకతోనే నాకు గుండె జబ్బు ఉంది ఆ విషయం మొదట్లో తెలియలేదు.

ఒంట్లో బాగోలేదని చిన్నచిన్న టెస్టులు చేస్తే అప్పుడు విషయం తెలియలేదు ఫైనల్ గా సిటీ స్కాన్ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. అయితే ఈ అనారోగ్యాన్ని ఇప్పుడు ఏమి చేయలేము. మా నానమ్మకి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, ఆమె 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్ చనిపోయారు. మా నాన్న కూడా చాలా ఎంగేజ్ లోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాను అలాగే యోగా, ప్రాణాయామం రోజు క్రమం తప్పకుండా చేస్తాను.

అలాగే తిండి విషయంలో కూడా చాలా కంట్రోల్ గా ఉంటాను. అయితే వచ్చిన సమస్యల్లా పుట్టుకతో వచ్చిన గుండెజబ్బుతోనే కాబట్టి జాగ్రత్తగా ఉంటాను. నాకు ఈ విషయం తెలిసినప్పుడు పిల్లలు భవిష్యత్తు గురించి చాలా బాధపడ్డాను అని చెప్పకు వచ్చారు రేణు దేశాయ్. ఒళ్ళు బద్ధకంతో ఒళ్ళు రాలేదు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఒళ్ళు వచ్చింది అంటూ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి బాధపడ్డారు రేణు దేశాయ్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -