Renu Desai: పవన్ ఫాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది నటి రేణు దేశాయ్. బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ చాలా తక్కువ సినిమాలలో నటించి వెంటనే పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే ఆ తరువాత వారి జీవితంలో జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకి చాలా సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి, కానీ పిల్లలకి న్యాయం చేయలేనేమో అని ఆ ఆఫర్స్ ని తిరస్కరించింది రేణు దేశాయ్. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవటంతో మళ్ళి సినిమాలపై దృష్టి పెట్టింది.

అప్పుడే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో వచ్చే ఆన్సర్ రావడంతో అందులో నటించింది. ఆ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆమె రెండవ వివాహం గురించి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం గురించి మాట్లాడింది. ఒక విలేకరి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అని అడిగితే అది నాకు సంబంధం లేని విషయం, అదంతా దేవుడు చూసుకుంటాడు అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. అలాగే నేను రెండవ వివాహం కూడా చేసుకుంటాను కానీ నా కూతురు కొంచెం పెద్దదవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.

ఈ స్టేట్మెంట్ కూడా తెగ వైరల్ కూడా అయింది. అయితే ఈ మాటల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తేలికగా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడొద్దు అంటూ రేణు దేశాయ్ ని వార్నింగ్ ఇస్తున్నట్లు మెసేజ్లు పెడుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది రేణు దేశాయ్. నేను ఏం మాట్లాడినా నిజమే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్నది నాకు సంబంధం లేని విషయం.

అది దేవుడు చూసుకుంటాడు. ఒక కామన్ మ్యాన్ గా కూడా నేను సపోర్ట్ చేయను. అలాగే నా ద్వితీయ వివాహం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పింది రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మార్పు రాలేదు, అప్పుడూ,ఇప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. నిజమేనండి రేణు దేశాయ్ సెకండ్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే కదా.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -