ABN RK:జగన్ పరువు పోయేలా ఆర్కే కామెంట్లు.. ఇంతలా దిగజారాలా?

ABN RK: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్ కి ముందే తెలుసని జగన్ కను సన్నల్లోనే ఈ హత్య జరిగింది అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్కే గత కొద్దిరోజుల క్రితం తన కొత్త పలుకులు ద్వారా సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. జగన్ దంపతులకు తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన వార్త ఉదయం నాలుగున్నర గంటలకే తెలిసిందని ఈయన తన కొత్త పలుకుల ద్వారా వార్తలు రాయడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తుంది.

సాధారణంగా ఆర్కె ఒక ఊహగానాన్ని వార్తలుగా రాసి దానిని నిజం చేసే ప్రయత్నంలో ఉంటారు ఇలా తప్పుడు వార్తలను నిజం చేసే ప్రయత్నంలో ఆర్కేది అందవేసిన చేయి అని చెప్పాలి. అయితే ఈయన చెప్పినది నిజం అనుకుంటే ఈ వార్తలను మరొక కోణంలో చూస్తే జగన్ పై ఎంత కుట్రకు పడ్డారో అర్థమవుతుంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చింది అయితే ఈ సినిమాలో ఎవరికీ తెలియనటువంటి ఒక సన్నివేశాన్ని చూపించారు.

 

ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో ఉండగా తన కుమారుడు చనిపోయారని వార్త తెలుస్తుంది కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత తన కొడుకుని చూడటానికి వెళ్తాడు ఇక్కడ ఆయనకు వృత్తిపట్ల ఉన్నటువంటి గౌరవం అని అందరూ చాటి చెబుతున్నారు. తన వల్ల నిర్మాతకు నష్టం రాకూడదని ఎన్టీఆర్ తన కొడుకు మరణ వార్తను కూడా దిగమింగుకొని సినిమాలలో నటించారని చెబుతారు.

 

ఇక జగన్ విషయానికి వస్తే ఆయన మేనిఫెస్టోకి సంబంధించి నలుగురికి కీలక నేతలతో మీటింగ్ లో ఉన్నారు. అయితే జగన్ బాబాయ్ మరణ వార్త తెలియగానే మీటింగ్ వదిలి రాకపోవడంతో తనది నేరమని ఆరోపిస్తున్నారు ఎన్టీఆర్ చేస్తే వృత్తిపట్ల గౌరవం జగన్ చేస్తే నేరమని ఆరోపణలు చేయడం ఒక ఆర్కే కు మాత్రమే చెల్లిందని పలువురు భావిస్తున్నారు.

 

మేనిఫెస్టోలో భాగంగా నలుగురు వ్యక్తులు ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు తన బాబాయి మరణ వార్త తెలిసి మధ్యలోనే మీటింగ్ వదిలి వెళ్ళలేరు. ఆ విధంగా నాలుగున్నర గంటల సమయంలో ఆయన పులివెందుల రావడానికి సిద్ధమైనప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలన్న కాస్త ఆలస్యమే అవుతుంది అందుకే ఆలస్యంలోనే ఈయన మీటింగ్ లో పాల్గొనే ఉన్నారని కూడా భావించవచ్చు. కానీ ఆర్కే మాత్రం తన ఊహగానాలతో ఏకంగా జగన్ పై ఇలాంటి నింద వేస్తున్నారంటూ పలువురు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -