Roja: అశ్లీల సినిమాల్లో నటించడం గురించి నోరు మెదిపిన రోజా.. ఆ సీడీలు ఎక్కడంటూ?

Roja:  సినీ నటి మంత్రి రోజా గురించి తాజాగా తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనకు తెలిసిందే. రోజా గురించి ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి అయితే సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.

నేను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాను అప్పటి నుంచి నాపై కక్ష కట్టారని ఈమె విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వారు కూడా సినిమా వాళ్ళేనని గుర్తించుకోవాలని ఈమె తెలిపారు. నేను కూడా ఒకప్పుడు మీ పార్టీలోనే ఉన్నాను అప్పుడు మంచిగా ఉన్న నేను పార్టీ నుంచి బయటకు వస్తేనే అశ్లీల చిత్రాలలో నటించానని వేధింపులకు గురి చేస్తున్నారు.

ఎమ్మెల్యే గా గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెడితే సిడిలు చూపించారు. మరి వాటిని మీడియాకు ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఈమె ప్రశ్నించారు. నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి మీరు ఎవరు. కుటుంబం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టపడుతూ నేను నా కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా రోజా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగినటువంటి ఈమె అనంతరం తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతల ప్రవర్తన నచ్చక వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చిన అనంతరం ఈమె గురించి తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల రోజా కూడా తన స్టైల్ లోని వారికి సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బండారు సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -