Anshu Malika: రోజా కూతురు ఎంట్రీకి సర్వం సిద్దం.. అన్షు మాలిక హవా ఇక షురూ

Anshu Malika: సినీ నటి, బుల్లితెరపై జడ్జ్, ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో మంత్రి ఇలా ఎన్ని ట్యాగులున్నా కూడా రోజాకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె నవ్వులకు అందరూ ఫిదా అవుతుంటారు. రోజా ఒకప్పుడు తెలుగులో ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన రోజా నటించేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదిరిపోయే పాత్రలను పోషించింది. మొండిగా, మొరటుగా కనిపించే పాత్రల్లోనూ నటించింది. టామ్ బాయ్ కారెక్టర్‌లను పోషించింది. అలా రోజా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక రోజా వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు, వారసురాలిని తెరపైకి తీసుకొచ్చేందుకు సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. రోజా కూతురు అన్షు మాలికి సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఆమె సినిమాల్లోకి రాబోతోందంటూ ఇది వరకే ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కూడా ఇంత వరకు నిజం కాలేదు. రోజా కూతురు చదువుల్లో ఫస్ట్. సామాజిక సేవలు చేయడంలో ముందుంటుంది. ఈ వయసులోనే ఎంతో మందిని చదివిస్తోంది. పుస్తకాలు రాస్తుంది. కొత్తగా ప్రయత్నిస్తుంటుంది. అలా అన్షు మాలికకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

అలాంటి అన్షు మాలిక సినిమాల్లోకి వస్తుందా? అనే అనుమానం కూడా అందరిలోనూ ఉంది.కానీ రోజా మాత్రం తన కూతురిని ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తుంటుంది. అన్షు మాలిక ఫోటోలను రోజా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక రోజా కూడా అన్షు సినీ ఎంట్రీ కోసం బాగానే ప్రయత్నిస్తోందట. ఇందుకోసమే యాక్టింగ్‌లోనూ శిక్షణ ఇప్పిస్తోందట. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు వచ్చేందుకు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లోనూ జాయిన్ చేస్తున్నారట.

ఈ మేరకు అన్షు మాలిక మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో వారికే తెలియాలి. ఒక వేళ సినీ ఎంట్రీ ఇస్తే.. అది తెలుగులో ఉంటుందా? తమిళంలోఉంటుందా? రెండూ కలిసి ద్విభాష చిత్రాన్ని చేస్తుందా? అన్నది చూడాలి. అసలే అన్షు మాలిక ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆమెకు మంచి క్రేజ్ కూడా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -