Romance: శ్రీహాన్ శ్రీసత్య మధ్య రొమాన్స్ మామూలుగా లేదుగా?

Romance: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం మరియు రెండు వారాలలో ముగియున్న నేపథ్యంలో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు తమదైన శైలిలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ సత్య గత ఎపిసోడ్లో భాగంగా ఏకంగా శ్రీహాన్ దుప్పట్లో దూరి రచ్చ చేయడం సంచలనంగా మారింది.ఇలా శ్రీ సత్య శ్రీహాన్ బెడ్ పైకి వెళ్లడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే…

బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో ముగియనుందన్న నేపథ్యంలో కంటెస్టెంట్లు అందరూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీ సత్య తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొస్తూ తన ఫ్రెండ్ కి ఒకరికి నిద్రలో నడిచే అలవాటు ఉందని అలా నడుస్తున్న సమయంలో గట్టిగా అరిచిన శబ్దం వచ్చిందని ఒక్కసారిగా అరవడంతో అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్ లందరూ ఏం జరిగిందోనని ఆందోళన చెందారు.

ఈ క్రమంలోనే గట్టిగా అరిచిన శ్రీ సత్య ఏకంగా శ్రీహన్ దుపట్లోకి దూరింది.అయితే శ్రీ హన్ మాత్రం ఒక్కసారిగా కంగారుపడుతూ భయపడిపోయాడు మరి ఆయన నిజంగానే భయపడ్డాడా లేక భయపడుతున్నట్లు యాక్టింగ్ చేశాడనే విషయం తెలియదు కానీ ఈ విషయం మాత్రం ఎపిసోడ్ కి హైలైట్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ వీడియోని కొందరు నెటిజన్ లు శ్రీహాన్ ప్రియురాలు సిరికి ట్యాగ్ చేస్తూ అసలు దుప్పట్లో ఏం జరిగిందో ఇంటికి వచ్చాక అడుగు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్లో ఇనయ బెడ్ పై దయ్యం పట్టినట్లు ప్రవర్తించడంతో కంటెస్టెంట్ లో కంగారుపడ్డారు. ఇలా ఇనయా కూడా తనదైన శైలిలో పర్ఫామెన్స్ చేసినప్పటికీ శ్రీ సత్య వ్యవహారం హైలెట్ కావడంతో కొందరు ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కోసమే శ్రీ సత్య ఇలా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -