BalaKrishna: ప్రభుత్వ స్థలాన్ని బాలయ్య కబ్జా చేశారా..అసలేం జరిగిందంటే?

BalaKrishna: నటసార్వభౌమ నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. 100 కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈయన వ్యాఖ్యాతగా కూడా చేశారు. అంతేకాదు ఆయన ప్రముఖ రాజకీయ నేత కూడా.
హిందూపురం ఎమ్మెల్యే, ఇటు సినిమాలు, అటురాజకీయాల్లో బాలయ్య ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయపరంగా ఆయన ఎవరికి ఎలాంటి అన్యాయం చేయరని అందరికీ తెలిసిందే అయితే ఆయన ఏనాడు ప్రజలకు అన్యాయం చేయలేదు. అలాంటి ఈ బాలకృష్ణపై ఇప్పుడు కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో తలెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. విజయ్ గోపాల్ అనే వ్యక్తి బాలకృష్ణ పై ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకున్నాడని ఆరోపణలు చేశాడు.
అయితే విజయ గోపాల్ విషయానికి వస్తే.. గతంలో బుక్ మై షో, పేటీఎం లాంటి సంస్థలు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ న్యాయపోరాటం చేశారు. దీంతో తనకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా రాబట్టాడు. తాజాగా బాలయ్య ఇంటి పేవ్ మెంట్ సర్కారు స్థలమని దాన్ని ఆయన దర్జాగా ఆక్రమించుకున్నట్లుగా పేర్కొంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అదే విధంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ లాంటి వారికి కూడా ట్యాగ్ చేశాడు.
ఇక ఆయన ఆ పోస్ట్ లో..’సాధారణ ప్రజలు కూడా సెలబ్రెటీలు అయితే వాళ్లు ఏం చేసినా మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటారా?’ అంటూ ట్వీట్ లో రాసుకోచ్చాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అదే విధంగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో ట్యాగ్ చేశారు. ఇక దీని గురించి ఎలాంటి సమాధానం బయటికి వస్తుంది అన్నది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -