Sachin: క్రికెట్ నుంచి సచిన్ నిష్క్రమించి నేటికి 9 ఏళ్లు

Sachin: ప్రపంచంలో క్రికెట్ దేవుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు సచిన్. 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్ సరిగ్గా ఇదే రోజు 2013లో రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో తన హోంగ్రౌండ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌పై చివరి టెస్టు ఆడాడు. దీంతో యావత్ క్రికెట్ అభిమానులు కంటతడి పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు. తన రిటైర్మెంట్ సందర్భంగా సచిన్ ఇచ్చిన స్పీచ్ కోట్లాది మంది క్రీడాభిమానులను కదిలించింది. తన 24 ఏళ్ల జీవితం 22 యార్డుల మధ్య అని సచిన్ చెప్పగానే కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

 

ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌ను 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై ఆడాడు. టెస్ట్, వన్డే, టీ20 కెరీర్‌లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సచిన్ మొత్తం 34,357 పరుగులు చేశాడు. అందులో 100 సెంచరీలున్నాయి. అంతేకాకుండా 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ రికార్డు ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు. భవిష్యత్‌లో కూడా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

 

ఇప్పటికీ చాలా రికార్డులు ఇంకా సచిన్ పేరిటే కొనసాగుతున్నాయి. అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీల రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. సచిన్ టెండుల్కర్ కెరీర్‌లో 1998 ముఖ్యమైన సంవత్సరం. ఆ ఏడాది 42 ఇన్నింగ్స్‌లలో అతడు 68.67 సగటుతో 2541 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి.

 

ఆ దేశాల్లో 50 యావరేజ్ కలిగిన ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై టెస్ట్ క్రికెట్‌లో 50 యావరేజ్ మెయింటైన్ చేసిన ఆటగాడు సచిన్ ఒక్కడే. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్‌లో 11 మ్యాచ్ ల్లో 89.25 సగటుతో 673 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -