Sai Rajesh: అందరివాడు ఫ్లాప్ కావడానికి సాయి రాజేష్ కారణమా.. ఏం జరిగిందంటే?

Sai Rajesh: సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ సినిమా ఇటీవలే విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్ర బంబృందం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.. వరుసగా సక్సెస్ మీట్ లను నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందించేందుకు ఆదివారం ఓ స్పెషల్ ఈవెంట్‌కు చిరంజీవి వచ్చాడు. బేబి మెగా కల్ట్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవి గురించి సాయి రాజేష్ మాట్లాడుతూ…

అన్నయ్య.. ఈ రోజు మీ స్పీచుకు ఎంత డిమాండ్ ఉందో, ఎస్ కే ఎన్, నేను ఈ రోజు ఏం మాట్లాడతామా? అని సోషల్ మీడియాలో అంతే డిమాండ్ ఉంది. జై చిరంజీవి ఆడియో ఫంక్షన్‌కు శిల్పా కళా వేదిక బయట పోలీసులతో దెబ్బలు తిన్నా, స్టాలిన్ టైంలో లోపలి వరకు వచ్చా. మా అవార్డ్స్ సమయంలో ఒకే వరుసలో కూర్చున్నాను. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న అన్నా, ఒక ఫ్యాన్‌కే తెలుస్తది ఈ మూమెంట్. 2005లో హైద్రాబాద్‌లో బస్సు దిగగానే.. ఈ రోడ్డులో ఆయన కారు తిరిగి ఉంటుందా?.ఆయన్ను ఒక్క రోజైనా కలుద్దామని గట్టిగా అనుకున్నాను. పాత బ్లడ్ బ్యాంక్ పంజాగుట్టలో ఉండేది. వెళ్లి బ్లడ్ ఇచ్చి వచ్చాను. చిరంజీవి గారిని కలిసి తీరాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను.

 

చిరంజీవి గారి ఫోటో షూట్ ఉందని వెళ్లమని చెప్పారు. మేం కోరుకుంటే మీకు తెలుస్తుంది అన్నయ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిలుద్దామంటే మీరు అమెరికాకు వెళ్లారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. కానీ మీరు ఈ రోజు వచ్చారు. మేం అనుకుంటే మీకు తెలిసిపోద్ది అన్నయ్య. మీరు దురదృష్టవంతులు. అది ఎందుకో చెబుతాను. మీరు చిరంజీవి గారు మాత్రమే చిరంజీవి ఫ్యాన్‌కు ఉండే అదృష్టం మీకు ఉండదు. మేం ఎలా ఎంజాయ్ చేస్తామో మీకు తెలియదు.. కష్ట సుఖాలు ఉన్నా, బాధలు ఉన్నా పారాసెట్మాల్, మ్యాన్షన్ హౌన్ అన్నీ మీరే. అమెరికాలో ఉన్న సాఫ్ట్ వేర్ లుంగీ కట్టుకుని సాయంత్రం ముఠామేస్త్రీ పాటలు చూస్తాడు.

 

ఇక్కడ ఓ కూలీ సాయంత్రం ఇంటికి వెళ్లి అబ్బనీ తీయని దెబ్బ అని చూస్తాడు.. అర్జున్ రెడ్డి తీసినోడు చిరంజీవి ఫ్యాన్..హృదయ కాలేయం తీసినోడు చిరంజీవి ఫ్యాన్.వైవీఎస్ చౌదరి గారి సినిమాకు వెళ్లాను.. పెద్ద ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చింది.. ఆయన అభిమానం చూశాను.. అరె అన్నయ్య అభిమానులం అని చెప్పుకుంటారు అంటూ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు సాయి రాజేష్. మీరు ఒక్క రోజు మాతో ఉండండి.. చిరంజీవి అభిమాని ఎలా ఉంటాడో.. ఎలా ఎంజాయ్ చేస్తారో చూపిస్తాం అని తెలిపారు రాజేష్..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -