Saitej: సాయితేజ్ పరువు తీసిన మేనేజర్.. విజయం ఎలా వస్తుందో చూస్తానంటూ?

Saitej: సుప్రీం హీరో సాయి ధరంతేజ్ ఆయన మేనేజర్ సతీష్ బొట్టా మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తుంది. సతీష్ గత కొంతకాలంగా సాయి ధరమ్ తేజ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఇలా మేనేజర్లు ఉంటారు వాళ్ళే హీరోల ఆర్థిక వ్యవహారాలన్నింటిని చూసుకుంటారు అలాగే సినిమా డేట్స్ కూడా చూసుకొని హీరోలకు సినిమా అవకాశాలను కూడా తీసుకువస్తూ ఉంటారు. ఇలా మేనేజర్లుగా ఉండడం వారికి కూడా చాలా ఆర్థికంగా లాభాలు కూడా ఉంటాయని చెప్పాలి.

అందుకే ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్క హీరో ఒకరు లేదా ఇద్దరు మేనేజర్లను పెట్టుకుంటూ ఉంటారు.మేనేజర్లు సదరు హీరోకి తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా జరిగితే చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ మేనేజర్ సతీష్ మాత్రం కాస్త ఓవర్ చేశారని దాంతో కోప్పడిన సాయిధరమ్ తేజ్ తనని వెళ్ళిపొమ్మని అరిచినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో సినిమా ప్రొడక్షన్లో గీత ఆర్ట్స్ కు చెందినటువంటి ఒక వ్యక్తిని నియమించారట అయితే అతనికి సతీష్ కి ఏ మాత్రం పడటం లేదు దీంతో ఆ వ్యక్తిని ఎందుకు తీసుకున్నారు అంటూ సతీష్ సాయి ధరమ్ తేజ్ పై అరిచారని తెలుస్తోంది.మెగా ఫ్యామిలీలో ఎంతో సహనం ఉన్నటువంటి ఈ హీరో చాలా ఓపికగా సమాధానం చెప్పినప్పటికీ చివరికి సతీష్ కాస్త మితిమీరి మాట్లాడటంతో తేజు సైతం సహనం కోల్పోయారని తెలుస్తుంది.

 

తేజు వద్దకు వెళ్లిన సతీష్ ఇప్పటివరకు నీకు ఇన్ని సక్సెస్ లు రావడానికి నేనే కారణం ఇకపై నీకు ఎలా సక్సెస్ సినిమాలు వస్తాయో నేను చూస్తాను అంటూ కాస్త హద్దులు మీరు మాట్లాడటంతో కోపడిన సాయి ధరమ్ తేజ్ తన నుంచి వెళ్ళిపోవాలని సూచించారట. మేనేజర్ల పని కేవలం ప్రాజెక్టులు తీసుకురావడం వరకే వారి పని ఆ సినిమా కథ విని చేయాలా వద్దా అని నిర్ణయించుకునే బాధ్యత పూర్తిగా హీరోలదేనని అయితే సతీష్ ఇలా మాట్లాడటంలో ఏమాత్రం అర్థం లేదని అందుకే తేజు కూడా సీరియస్ అయ్యి తనని వెళ్లిపొమ్మని చెప్పారని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -