YS Sharmila: షర్మిల కాంగ్రెస్ లో చేరితే చంద్రబాబు కి సంబంధం ఏంటి సజ్జల…

YS Sharmila: సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడు. అనధికారి మంత్రి అనధికార ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తర్వాత అనధికార ముఖ్యమంత్రి లాంటి అతను. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరమాత్మ అని చెప్పాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు విప్పారు ఆయన బదులుగా సజ్జల మీడియా ముందుకు వచ్చి నోరు విప్పుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏ హోదా లేకపోయినా కూడా సజ్జల ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రెస్ మీట్ లు పెట్టి మరీ మాట్లాడతారు.

 

తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం పట్ల స్పందించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీకి అంబానికి సంబంధం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయని అన్నారు. అలాంటప్పుడు అంబానీ సన్నిహితుడైన నత్వానికి వైసిపి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చిందో మాత్రం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల గురించి ఎప్పుడు వార్తలు బయటకు వచ్చిన అవన్నీ చంద్రబాబు నాయుడు చేయించాడని మాట్లాడుతారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనకాల కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడని సజ్జల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటలు మాట్లాడడానికి సజ్జలకి సిగ్గు ఉందో లేదో తెలియడం లేదు కానీ…. వినేవారికి ఆ మాటలు చదివే వారికి మాత్రం సిగ్గేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అది వైసీపీకి పెద్ద దెబ్బనే విషయం తెలిసిన సజ్జల దాన్ని డైవర్ట్ చేయడానికి టాపిక్ చంద్రబాబు వైపు తిప్పారు. చంద్రబాబు ఎన్ని సంక్షేమ పథకాల అమలు చేస్తామని చెప్పిన ప్రజలు ఎవరు నమ్మరని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాలకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో కూడా వైసిపి గెలుస్తుందని అన్నారు. అయితే ఒక పక్క వైసిపి ఎమ్మెల్యేలు మారుస్తూ నియోజకవర్గ అభ్యర్థులను మారుస్తూ ఉంటే దానిపైన ఏమీ స్పందించని సజ్జల ప్రతిపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేస్తూ భుజాలు తడుముకుంటున్నారు.

 

తమ పార్టీ నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న అవి ఏమీ వినపడనట్టు నటిస్తున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా అనధికారి ఎమ్మెల్యే మంత్రి అయిన సజ్జలతో మాట్లాడించి పంపించడం కొందరిని బుజ్జగించడం అంతా సజ్జల కనుసనల్లో జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఏం జరిగినా అది చంద్రబాబు మీదకు నెట్టేసి వెర్రి నవ్వులు నవ్వుకోవడంతో ప్రజలు కూడా వీళ్లను చూసి నవ్వుతున్నారు. సీఎం జగన్ చెప్తుంటే సజ్జల చేస్తున్నారో లేక సొంత తెలివితోనే సజ్జల ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతిస్తున్నారో తెలియదు కానీ, ఏం చేసినా వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనే విషయాన్ని సజ్జలు అయంత త్వరగా గమనిస్తే అంత మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -