Sajjala Ramakrishna Reddy: చంద్రబాబును జైలుకు పంపామని జనం మర్చిపోయారట.. సజ్జల కామెడీ మామూలుగా లేదుగా!

Sajjala Ramakrishna Reddy: ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో జరిగిన పెద్ద పరిణామం ఏదైనా ఉంది అంటే.. అది చంద్రబాబు అరెస్ట్. ఆయన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ విదేశాల్లో కూడా నిరసనలు జరిగాయి. అయితే, దాన్ని వైసీపీ నాయకులు ఎగతాలి చేస్తున్నారు. అది పక్కన పెడితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్‌ను కూడా అన్ని పార్టీలు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాయి. చంద్రబాబు మా వాడే అని అన్ని పార్టీల నేతలు ప్రకటించుకునేందుకు ప్రయత్నించాయి. అయితే, ఒక్క కేటీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్ట్ విషయంలో నోరు జారారు. నిజానికి అరెస్ట్ విషయంలో కూడా కాదు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలకు పర్మిషన్ లేదని అన్నారు. దాని ప్రభావం తర్వాత చాలా ఎక్కువగా కనిపించింది. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినా.. లాభం లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగి బీఆర్ఎస్ ఓడిపోయింది. అలా అని ఒక్క చంద్రబాబు అరెస్ట్ మాత్రమే తెలంగాణ రాజకీయాలను శాసించిందని అనుకోలేం. కానీ, దాని ప్రభావం చాలా ఎక్కువగానే పడింది.

ఇప్పుడు ఏపీ రాజకీయాల దగ్గరకు వచ్చినట్టు అయితే.. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని ప్రజలు మర్చిపోయారని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణరెడ్డి అంటున్నారు. పక్క రాష్ట్రంలోనే గెలుపోటములను ప్రభావితం చేసే అంత స్థాయికి చంద్రబాబు అరెస్ట్ అంశం వెళ్లింది. అలాంటిది ఏపీ ప్రజలు ఎలా మర్చిపోతారని అనుకుంటున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నికల ముందు యాబై రోజులకు పైగా చంద్రబాబును జైల్లో పెట్టారు. అవి అక్రమ కేసులా? సక్రమ కేసులా పక్కన పెడితే జైల్లో పెట్టడం నిజం. ఇండియా కూటమి కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించింది. పోలింగ్ దగ్గక పడే కొద్ది ఈ ఎన్నికలు చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అలాంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతారని సజ్జల అనడం విడ్డూరంగా ఉంది. అసలు సజ్జల ఆ విషయం ఎందుకు అనాల్సి వచ్చింది. అంటే.. చంద్రబాబు అరెస్ట్ అంశం ప్రజలకు గుర్తు ఉంటే.. అది వైసీపీకి నష్టం జరుగుతుందనే కదా? అంటే, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశామని సజ్జల పరోక్షంగా ఒప్పుకున్నారు. కదా? అలాంటప్పుడు ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయాలి?

సీఎం జగన్ ఎవరి మాట వినరు. ఆయన మాట ఆయనిదే. ఎవరి సలహాలు పాటించరు. తరువాత జరిగే నష్టాలను మరో రకంగా ఎదుర్కోవచ్చు. ముందు జరగాల్సిన కార్యం చూడండి అనే రకం వైఎస్ జగన్. చంద్రబాబు పదేపది జగన్ ను అవినీతిపరుడు అంటారు. జైలుకు వెళ్లి వచ్చారు అని అంటారు. దాంతో పాటు.. తనపై ఎన్నో కేసులు పెట్టినా ఒక్కటి కూడా కోర్టులో నిలబడలేదని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కేసులు నిలబడలేదని మరోసారి చంద్రబాబు నోటి నుంచి రాకూడదు. అందుకే, చంద్రబాబును జైల్లో పెట్టాలి. ఒకవేళ దాని వలన రాజకీయంగా ఏదైన నష్టం జరిగితే.. తర్వాత చూసుకోవచ్చు. కానీ, చంద్రబాబు జైలుకు పోవాలి అనుకున్నారు. పంపించేశారు. కానీ.. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అసలే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అండగా ఉంటుంది అనుకున్న బీజేపీ కూడా టీడీపీతో పొత్తుకు రెడీ అవుతుంది. ఈ టైంలో చంద్రబాబు అరెస్ట్ సింపతి ప్రజల్లోకి వస్తుందేమో అన్న భయం వైసీపీ నేతల్లో పట్టుకుంది. అందుకే చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రజలు మర్చిపోయారు అంటున్నారు. ప్రజలు మర్చిపోయారో.. గుర్తించుకున్నారో తర్వాత కానీ.. మర్చిపోయారు.. మర్చిపోయారు అంటూ గుర్తు చేయడానికి సజ్జల లాంటి వారు ఉన్నారు కదా? అని సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -