Ramakrishna Reddy: ఆర్థిక ఒత్తిళ్ల వల్ల ఉద్యోగులకు అనుకున్న విధంగా చేయలేదట.. సజ్జల కామెడీకి అడ్డూఅదుపు లేదుగా!

Ramakrishna Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంపై రాష్ట్ర ప్రజలందరూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ బిడ్డ మీకు మంచి చేస్తాడు అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసారు. రైతుల నుంచి మొదలుకొని ఉద్యోగుల వరకు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఈసారి ఎన్నికలలో ఉద్యోగులు తమ ఓటుతో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు ఎప్పటినుంచో ఇయాల్సిన పీఆర్సీలు , ఇంక్రిమెంట్లు వంటివి ఇవ్వకుండా ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఉందనే విషయం తెలుసుకున్నటువంటి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులను బుజ్జీగింప చేసే ప్రయత్నంలో ఉన్నారు.

ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈయన వీడ్కోలు సభ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను బుజ్జగింప చేసే ప్రయత్నం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మన ప్రభుత్వం మంచి ఆలోచనలను చేస్తోంది అయితే ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆ మంచిని అమలు పరచలేకపోయామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అర్థం చేసుకోవాలని ఈయన కోరారు. గతంలో చెప్పినట్టుగా ఉద్యోగులకు చేయాల్సినవన్నీ కూడా ముందు ముందు తప్పకుండా నెరవేరుస్తాము అంటూ ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -