Salaar: ఒక్క సలార్ ఇన్ని సినిమాలను నాశనం చేసిందా.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Salaar: ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సలార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తరికెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు నేపథ్యంలో ఎన్నో సినిమాల విడుదల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఆ తేదీన విడుదల కావాల్సిన హాయి నాన్న సినిమా డిసెంబర్ 7వ తేదీకి వచ్చింది అయితే అప్పటికే విడుదల కావాల్సినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇబ్బందులలో పడింది ఇది కాక నితిన్ సినిమా వరుణ్ తేజ్ సినిమా కూడా అదే సమయానికి విడుదలవుతున్నాయి ఇలా ఈ సినిమాల విడుదల విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది.

ఇలా తమ సినిమాకు ఇబ్బంది కలుగుతుందన్న కోపంతో విశ్వక్ బూతులతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ముందుగా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల అవుతుందని చెప్పడంతో స్కంద పెద్దకాపు మార్కంతోని వంటి సినిమాలన్నీ కూడా ఒకేసారి విడుదలయ్యాయి అయితే ఈ సినిమాలన్నీ కూడా కలెక్షన్ల పరంగా భారీగా డిజాస్టర్లు అయ్యాయి.

సలార్ సినిమా 22వ తేదీ విడుదల కాబోతుండడంతో షారుక్ ఖాన్ డంకి సినిమా విడుదల విషయంలో కూడా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాలలో సలార్ సినిమాకు పెట్టే ప్రయత్నాలు కూడా భారీగా జరుగుతున్నాయని చెప్పాలి . ఏది ఏమైనా సలార్ సినిమా వాయిదా వేసి ఎన్నో సినిమాలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించాయని ఎన్నో సినిమాలకు ఈ సినిమా తీవ్రమైనటువంటి నష్టాలను కలిగించిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -