Salaar: సలార్ ఓపెనింగ్ టార్గెట్ రూ.200 కోట్లా.. బాక్సాఫీస్ వద్ద మామూలు విధ్వంసం కాదంటూ?

Salaar: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా చెప్తుంది 28 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా కోటి ఆశలు పెట్టుకున్నారు.

అంతే కాకుండా కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. గట్టిగా చూసుకుంటే నెల రోజులు మాత్రమే ఉంది. ఇండియాలో ఐదు భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దానికోసమే ప్రశాంత్ నీల్ కాస్తా ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకి మించి మూవీ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

 

ఇండియా కాకుండా ఇతర దేశాలలో కూడా భారీ స్క్రీన్స్ లో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. యూఎస్ లో అయితే 40కే డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే దాటిపోయాయి. ట్రైలర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అది రిలీజ్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆదిపురుష్ ని ప్రభాస్ కెరియర్ లోనే హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సలార్ కి అంతకు మించి జరగొచ్చని భావిస్తున్నారు. అలాగే మొదటి రోజే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఒక 200 కోట్ల గ్రాస్ మొదటి రోజు అందుకుంటే మాత్రం కచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే ఫస్ట్ డే 200 కోట్ల కలెక్షన్ మార్క్ ని దాటింది. మరి భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -