Salaar: డిజిటల్ రైట్స్ విషయంలో సలార్ రికార్డ్.. ఆ విషయంలో ప్రభాస్ ను కొట్టే మగాడు ఉన్నాడా?

Salaar:  మసి పూసుకొని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యాక్షన్ చూసేందుకు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కే జి ఎఫ్ తర్వాత ప్రశాంత్ నేను చేస్తున్న హై వోల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. అయితే ప్రేక్షకుల నిరీక్షణకు పరీక్షలు పెడుతూ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. కనీసం మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతున్నది కూడా చెప్పలేదు మూవీ మేకర్స్. సినిమా షూటింగ్ ముగించుకొని విదేశాలకి వెళ్ళిపోయాడు ప్రభాస్. ఇక మిగిలిన బాధ్యత అంతా ప్రశాంత్ నీల్ చూసుకోవాల్సిందే. అయితే మరోవైపు మూవీ మేకర్స్ సాలార్ సినిమా బిజినెస్ డీల్ ని క్లోజ్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే సాలార్ మూవీకి ఓవర్సీస్ లో డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి జరగని ఓవర్సీస్ బిజినెస్ సాలార్ కి జరిగినట్లు సమాచారం. ఇక ఓటిటి డీల్స్ అయితే సాలార్ క్రేజీ ఏంటో నిరూపిస్తున్నాయి. అయితే ఇంతకుముందు రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఆశించిన స్థాయిలో లాభాలు సాధించలేకపోయింది.

అందుకే సాలార్ మూవీ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా సమాచారం. అయితే ఇదే అదునుగా నెట్ ఫిక్స్ కళ్ళు చెదిరే అమౌంటు ఆఫర్ చేసినట్లు సమాచారం. కరెక్ట్ ఫిగర్ తెలియదు కానీ 200 కోట్లు నుంచి 300 కోట్లు వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను దాదాపు 250 కోట్లతో నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ కి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. అసలు మొత్తం ఓటీటిలోనే వచ్చేస్తే ఇక సాటిలైట్ థియేటర్ రైట్స్ మీద వచ్చే ప్రాఫిట్ అంతా లాభమే.

అయినప్పటికీ హోం బలే ఫిల్మ్స్ పై ప్రభాస్ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. విషయం ఏమిటంటే సాలార్ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులు అయింది. కనీసం ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతున్నది కూడా చెప్పకపోవడంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రియులు. ఏది ఏమైనాప్పటికీ రికార్డులు కొల్లగొట్టడం లో ప్రభాస్ ని మించిన మొనగాడు లేడని మరొకసారి రుజువైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -