Chiranjeevi-Balakrishna: వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో విజేత అతనేనా?

Chiranjeevi-Balakrishna: సంక్రాంతి బరిలో ఈ సారి పెద్ద హీరోలు నిలిచారు. తీవ్రమైన పోటీ తప్పేలా లేదు. ఈసారి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడు కొత్త కాదు. గతంలో చాలా సార్లు బాలయ్య, చిరంజీవి సినిమాలు ఒకేసారి పోటీపడ్డాయి.

1985 నుంచే వీరిద్దరి సినిమాలు వస్తున్నాయి..

చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి పోటీలో నిలవడం 1985 నుంచే కొనసాగుతోంది. ఆ ఏడాది జనవరి 11న కె.బాపయ్య డైరెక్షన్ లో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమా విడుదలైంది. బాలకృష్ణ నటించిన చిత్రం ఆత్మబలం.. అదే ఏడాది జనవరి 24న రిలీజైంది. అప్పుడు చిరంజీవి విజేతగా నిలిచారు. ఆత్మబలం చిత్రం ప్లాప్ అయ్యింది.

వరుసగా చిరంజీవే విజేత..

తర్వాత 1987లో మళ్లీ పోటీ పడ్డారు. కోదండరామిరెడ్డి నిర్మించిన చిరంజీవి సినిమా దొంగ మొగుడు జనవరి 9న విడుదలైంది. తర్వాత అదే ఏడాది జనవరి 14న బాలయ్య నటించిన భార్గవ రాముడు విడుదలైంది. అప్పుడు కూడా విజేత చిరంజీవే. అనంతరం 1988లో సంక్రాంతి కానుకగా రాఘవేంద్ర రావు నిర్మించిన, చిరంజీవి నటించిన మంచి దొంగ చిత్రం జనవరి 14న వచ్చింది. ముత్యాల సుబ్బయ్య నిర్మించిన ఇన్ స్పెక్టర్ ప్రతాప్ చిత్రం జనవరి 15న రిలీజ్ చేశారు. మూడోసారి కూడా చిరంజీవి విజేతగా నిలిచారు.

1997లో నాలుగోసారి పోటీ పడగా చిరంజీవి హిట్లర్ జనవరి 4న విడుదలైంది. బాలయ్య నటించిన పెద్దన్నయ్య చిత్రం జనవరి 10న వచ్చింది. ఇక్కడా చిరంజీవి చిత్రం విజయవంతంగా ఆడింది. ఇలా చాలా సార్లు సంక్రాంతి బరిలో చిరంజీవి చిత్రాలే విజయవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతి బరిలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరి సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఆ హీరోకు నష్టం జరిగే ప్రమాదం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -