అప్పట్లో ఎన్టీఆర్ నటించిన సినిమాలలో రాముడు పేరుతో వచ్చిన సినిమాలు ఏవో తెలుసా?

నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతి నటసార్వభౌమ గా గుర్తింపు పొందిన ఈయన నటన ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఎన్టీఆర్ గారు రాముడు అనే పేరు వచ్చేలా 15 సినిమాలు చేశారు. అందులో ఎన్ని విజయం సాధించాయో ఇప్పుడు చూద్దాం.

అగ్గి రాముడు: 1954లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది. ఇదే ఆయన రాముడు అనే పేరుతో చేసిన తొలి సినిమా.

శభాష్ రాముడు: ఈ సినిమా 1959లో విడుదలైంది. ఇది కూడా విజయం సాధించడం జరిగింది.

బండ రాముడు: 1959లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

టాక్సీ రాముడు: 1961 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

టైగర్ రాముడు: 1962లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

రాముడు భీముడు: 1964లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

పిడుగు రాముడు: 1966లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

రాముని మించిన రాముడు: 1975లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ గా ఆడడం జరిగింది.

అడవి రాముడు: 1977లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

డ్రైవర్ రాముడు: 1979లో ఈ చిత్రం విడుదల కాగా ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

శృంగార రాముడు: 1979లో ఈ చిత్రం విడుదల కాగా ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

ఛాలెంజ్ రాముడు: 1980లో ఈ చిత్రం విడుదల కాగా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

సర్కస్ రాముడు: 1980లో ఈ చిత్రం విడుదల కాగా ఈ చిత్రం యావరేజ్ గా ఆడడం జరిగింది.

సరదా రాముడు: 1980లో ఈ చిత్రం విడుదల కాగా ఈ చిత్రం కూడా ఆవరేజ్ గా ఆడడం జరిగింది.

కలియుగ రాముడు: 1982లో ఈ చిత్రం విడుదల కాగా ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.

ఇలా రాముడు అనే పేరుతో వచ్చిన సినిమాలతో ఎన్టీఆర్ చాలానే హిట్లు కొట్టారు. రాముడు అనే పేరు ఆయనకు బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -