Sr NTR: ఏంటి.. సీనియర్ ఎన్టీఆర్ సినిమా అప్పట్లో ఒక్కరోజు కూడా ఆడలేదా!

Sr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గురించి అతని నటన గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఒకప్పటి టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎంతోమంది పెద్ద హీరోయిన్ల సరసన నటించి ఎన్టీఆర్ తెలుగు నాట తిరుగులేని హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా అప్పట్లో ఎన్టీఆర్ అగ్రస్టార్ హీరోగా తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు.

ఇక పెద్ద ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా విడుదలయితే చాలు ఆ సినిమా పోస్టర్ ను చూసి ఎన్టీఆర్ అభిమానులు తండోపతండాలుగా సినిమా కోసం ఎగ పడుతూ ఉంటారు. ఎన్టీఆర్ ఎటువంటి సినిమా తీసినప్పటికీ తన అభిమానులు మాత్రం ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తారు. ఇక ఆ సినిమాకు ప్రేక్షకాదరణ కూడా ఆ విధంగానే దక్కుతుంది. ఈ విధంగా ఎన్టీఆర్ సినిమాలు అప్పటి ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో హడావిడి చేసేవి.

కొన్ని సినిమాలు 300నుంచి 1000 రోజులకు పైగా ఆడినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ నటన అప్పట్లో ఒక రేంజ్ లో కనపరిచేవాడు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక సినిమా ఒకరోజు కూడా ధియేటర్లో ఆడలేదట. అప్పట్లో ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక ఘోరంగా డిజాస్టర్ పాలయిందట. 1960లో విడుదలైన ఆ సినిమా పేరు కాడెద్దులు ఎకరం నేల. అదే సంవత్సరం ఎన్టీఆర్ పది సినిమాల్లో నటించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్న సమయంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఒక పేదరైతుగా ఎన్టీఆర్ పాత్ర పోషించాడు. అదేవిధంగా షావుకారి జానకి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు భారీ స్థాయిలో నిరాశను మిగిల్చింది. ఎన్టీఆర్ సినిమాలంటే భారీ ఎత్తున ఎగబడే ప్రేక్షకులు అప్పట్లో ఈ సినిమాని చూడడానికి అంతగా ఆసక్తి చూపలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -