Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

Sr NTR:  సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో నవరసనటసార్వభౌముడిగా పేరు సంపాదించుకున్నారు. అటు పొలిటికల్ గా ఇటు సినిమాలలో సక్సెస్ సాధించిన వ్యక్తులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు కావడం గమనార్హం. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి మాత్రం అభిమానులలో చాలామందికి తెలియదు. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందేనని చెప్పవచ్చు.

సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకునిగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆహారపు అలవాట్లకు సంబంధించి అస్సలు రాజీ పడేవారు కాదని సమాచారం. ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉంటే సీనియర్ ఎన్టీఆర్ 5.45 గంటలకే నిద్ర లేచేవారు. అరచేతి మందంతో ఉండే 20 కంటే ఎక్కువ ఇడ్లీలను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారని సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో మూడు షిప్ట్ లలో పని చేసేవారని సమాచారం.

కొన్ని సందర్భాల్లో సీనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన జ్యూస్ లలో యాపిల్ జ్యూస్ ఒకటి కావడం గమనార్హం. వేసవికాలంలో ఆయన ఆహారపు అలవాట్లు వేరుగా ఉండేవి. రోజుకు రెండు లీటర్ల చొప్పున బాదంపాలు ఆయన తీసుకునేవారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగటానికి ఆయన ఇష్టపడేవారు.

స్నాక్స్ గా బజ్జీలను తినడానికి ఆయన ఎంతో ఇష్టం చూపించేవారు. బజ్జీలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఆయనకు ఎంతో ఇష్టం కాగా అవి తినడం ద్వారా అలసట రాదని ఆయన కో ఆర్టిస్ట్ లకు సలహా ఇచ్చేవారని సమాచారం అందుతోంది. సీనియర్ ఎన్టీఆర్ భోజనంలో నాటుకోడి కూడా ఉండేదని వేర్వేరు రకాల కూరలు, పెరుగు, నెయ్యి అంటే ఆయనకు ఎంతో ఇష్టమని బోగట్టా.

కొత్త ప్రాంతానికి వెళ్లిన సమయంలో అక్కడి వెరైటీలను తినడానికి కూడా సీనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపేవారని సమాచారం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం కొన్ని సందర్భాల్లో సీనియర్ ఎన్టీఆర్ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా జీవనం సాగించారు. పరిస్థితులకు అనుగుణంగా సీనియర్ ఎన్టీఆర్ సాధారణ జీవితాన్ని గడిపిన రోజులు సైతం ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -