Sharmila: షర్మిల పార్టీ టికెట్లు దరఖాస్తు చేసుకునేవారు కూడా లేరా… మరీ ఘోరమంటూ?

Sharmila: ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ తెలంగాణలో కాబోయే సీఎం నేనే అంటూ ప్రకటించిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తెలంగాణ రాజకీయాలను మారుస్తానన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. పాపం మొన్నటి వరకు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేద్దాం అనుకుంది షర్మిల. అది సాధ్యం కాకపోవటంతో 119 వర్గాల్లోనూ పోటీకి సై అన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.

అయితే షర్మిల పార్టీ టికెట్లకు పెద్దగా స్పందన కనిపించలేదు. కనీసం నియోజకవర్గానికి ఒక్క దరఖాస్తు కూడా ఇప్పటివరకు అందకపోవటంతో పరువు నిలబెట్టుకునేందుకు అభ్యర్థుల వేట ప్రారంభించారని టాక్. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా కేవలం 62 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ ప్రకటన తర్వాత పాదయాత్ర మీద పెట్టిన దృష్టి పార్టీ నిర్మాణంపై పెట్టకపోవటమే షర్మిల చేసిన పెద్ద తప్పు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తన బలగాన్ని పరిశీలించకుండా 119 నియోజకవర్గాల్లోని పోటీ చేస్తాను అని చెప్పటం పైన కూడా చర్చ జరుగుతుంది. నిజానికి పది పదిహేను స్థానాల్లో పోటీ చేద్దామని షర్మిల కి ఆ పార్టీ నేతలు సూచించారు కానీ షర్మిల ఆ మాటలని పెద్దగా పట్టించుకోలేదన్నది కొందరి వాదన. ఇక దరఖాస్తుల విషయం పోటీ విషయం ఎలా ఉన్నా నువ్వు పార్టీలో షర్మిల ఒక్కరే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి.

పార్టీ ఆవిర్భావం అప్పుడే తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. ఆ తరువాత సికింద్రాబాద్ మిర్యాలగూడ అంటూ ప్రతిపాదన వచ్చిన షర్మిల పాలేరు వైపే మగ్గుచూపారు. అయితే షర్మిల భర్త బ్రదర్ అనిల్,తల్లి విజయమ్మ ల పోటీపైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇతర పార్టీలలో టిక్కెట్లు రానివారు తమ పార్టీ వైపు చూస్తున్నారు అని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -