Sharmila: కాంగ్రెస్ ను పరుగులు పెట్టిస్తున్న షర్మిల.. ఫలితం ఉంటుందా?

Sharmila: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజకీయ చదరంగం ప్రారంభమైంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎవరికివారు ఎదుటివారిని చిత్తు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వైయస్ జగన్ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ఉంటే మరొకవైపు షర్మిల ఆయనపై మాటలు యుద్ధం మొదలుపెట్టారు.

 

అయితే షర్మిల కి ఇప్పుడు కొండంత అండ కొండా సురేఖ తోడైంది. మొన్నటి వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర చేసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఏపిపిసిసిగా బాధ్యతలు స్వీకరించి అన్నపై యుద్ధానికి ప్రారంభోత్సవం చేశారు. ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నూతన జవసత్వాలు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో నియోజకవర్గాల వారీగా షర్మిల పర్యటించి పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులలో జోష్ ని పెంచుతున్నారు. అదే సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచడానికి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కుటుంబంతో సంబంధాలు ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ విస్తృత ప్రచారం నిర్వహించిన సురేఖ ఇప్పుడు ఏపీకి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్ధం అంటున్నారు.

 

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల ప్రచారానికి తానూ వెళతానని కొండ సురేఖ తెలిపారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు వైసీపీలో లేననే విషయాన్ని కొండా సురేఖ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అన్నపై యుద్ధం ప్రకటించి, అన్నపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న షర్మిల కి కొండా సురేఖ కొండంత అండ అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -