Sharmila-Jagan: బల ప్రదర్శన చేయనున్న షర్మిల…కడప లో జగన్ కు షాక్….!

Sharmila-Jagan: Sharmila-Jaganజగన్మోహన్ రెడ్డికి సొంత ఇంట్లో కుంపటి తప్పేలా కనబడడం లేదు. ఇప్పటికే వైసీపీ పైన ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఒకపక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమవుతున్నాయి. మరోపక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదు అన్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలాకి అప్పగించింది. అయితే షర్మిల కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల తన బలప్రదర్శన చేయాలని అనుకుంటున్నారు. దీనికి కడపను స్థానంగా ఎంచుకున్నారు. మరొక కొద్ది రోజుల్లో తన అనుచర గణంతో షర్మిల కడపలో భారీ ర్యాలీ చేయనున్నారట. షర్మిల కు మద్దతు తెలిపేందుకు జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకులతో పాటు ఆమె అభిమానులు కూడా పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారు. భారీగా కార్లతో బైకులతో ర్యాలీ చేసి షర్మిలాకు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. మరోపక్క ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా మళ్లీ తిరిగి రాజకీయాల వైపు ఫోకస్ పెడుతున్నారు. పలు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.ఇది జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బగా రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తున్నారు. ఒకవేళ కడప నుండి షర్మిల గనుక ఎంపీ స్థానంలో పోటీ చేస్తే అది కడప రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది.

దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అంశంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల జనసేన తెలుగుదేశం మిత్రపక్షాలు బలపడే అవకాశం ఉందని అంటున్నారు షర్మిల కొన్నిచోటల్లో ఎంతో కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంది.ఆ ఓటు బ్యాంకు అంతా జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓటు బ్యాంకు. దీనివల్ల టఫ్ ఫైట్ ఉండే చోట్ల జనసేన తెలుగుదేశం మిత్ర కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు పోరు మరో పక్క సొంతింటి పోరుతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో పాలిపోక తాడేపల్లిలో తల పీక్కుంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటేనే జగన్మోహన్ రెడ్డి వణికి పోతున్నారాట.ఇప్పుడు దానికి తోడు షర్మిల కూడా వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటైతే స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుండి దింపేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -