Sharmila: ఏపీలో పొలిటికల్ లెక్కలు మార్చనున్న షర్మిల.. ఏం జరిగిందంటే?

Sharmila: ఎప్పుడైతే వైయస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుందో అప్పుడే ఆమెకి కాంగ్రెస్ లో కీలక పదవి లభిస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఆమె చేతికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఏఐసీసీ అధికారికంగా నియమించింది. ఇన్ని రోజులు గొడుగు రుద్రరాజు ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఆయన స్థానంలో షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది హై కమాండ్.

 

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. అలాగే తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కూడా ప్రకటించారు. తన అన్నతో విభేదాలు కారణంగా తెలంగాణకు వెళ్లిన షర్మిల అక్కడ వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అక్కడ కేసీఆర్ సర్కార్ పై పెద్ద యుద్ధమే చేశారు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టారు కేసీఆర్ సర్కార్ పై ఒంటి కాలుపై లేచిన షర్మిల సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు సైలెంట్ అయిపోయారు.

అప్పట్లోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ తీర్థం పుట్టుకుంటారని వార్తలు వచ్చాయి. పలుమార్లు కాంగ్రెస్ హై కమాండ్ తో షర్మిల చర్చలు కూడా జరిపారు. త్వరలోనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించారు కానీ చివరికి వచ్చేసరికి అది జరగలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరొకసారి కాంగ్రెస్ హై కమాండ్ తో షర్మిల చర్చలు జరిపారు.

ఈ మేరకు ఇటీవల ఢిల్లీకి వెళ్లి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం కూడా చేశారు. ఆ సమయంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పుడే ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తారని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఆ పదవి షర్మిల కి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీనితో ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడవలసిందే.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -