Sharmila: వైసీపీపై మరోమారు షర్మిల ఫైర్.. పరువు పోయిందిగా!

Sharmila:గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో వైయస్ షర్మిల పర్యటించారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఏపీపీసీసీ వైస్ చైర్మన్ షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన డీఎస్సీ ప్రకటన ఎన్నికల స్టంట్ అని ఆమె ఆరోపించారు.

 

ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏపీని వదిలి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు షర్మిల. పేదలకు 25 లక్షల ఇల్లు కట్టిస్తానన్న జగన్ ఒక ఇల్లు అయినా కట్టించారా అని నిలదీశారు.రానున్న ఎన్నికల్లో రాష్ట్రం గురించి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటెయ్యండి.

ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది. రాహుల్ గాంధీ మొదటి సంతకం దానిపైనే అని షర్మిల చెప్పారు. మద్యం వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ కబ్జాలకు కూడా పాల్పడే అవకాశం ఉందని షర్మిల విమర్శించారు. ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా భూకబ్జాలు చేసే చెత్త ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు.

 

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని హామీ ఆరోపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం వల్ల మరణించిన వారే ఎక్కువ అని తెలిపారు. లిక్కర్ బిజినెస్ చేస్తున్న సర్కారు భవిష్యత్తులో భూకబ్జాలకు కూడా పాల్పడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోకండి, కానీ ఓటు మాత్రం ఆలోచించి వేయండి అని సూచించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -