Sharwanand: వామ్మో శర్వానంద్ ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కాగా మొదట చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఆ తర్వాత తెలుగులో హీరోగా రన్ రాజా రన్, శతమానం భవతి , గమ్యం, ప్రస్థానం, మహానుభావుడు లాంటి మంచి మంచి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో శర్వానంద్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

శర్వానంద్ రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో శర్వానంద్ అందరి కంటె ఒక అడుగు ముందే ఉంటాడన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ అదే విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలు అన్నీ పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో ఎక్కువగా ఉన్నాయి, అయితే వారి దగ్గర నేను ఎప్పుడూ కూడా తక్కువ తీసుకోలేదు.

చిన్న చిన్న నిర్మాతలు వస్తే మాత్రం కచ్చితంగా తక్కువ పారితోషికం తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు శర్వానంద్. అనంతరం యాంకర్ ప్రశ్నిస్తూ మీకు హైదరాబాదులో చాలా ఏరియాలో స్థలాలు ఉన్నాయంట కదా మీరు బాగా రిచ్ అని ఈ సిటీలో 3వంతుల భాగం మీకే ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి అందులో నిజం ఎంత అని అడిగారు.

ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ…మా అమ్మ నాన్న బాగానే సంపాదించారు. నేనే సొంతంగా సినిమాలు తీసుకోగలిగే కెపాసిటీ మాకుందని చెప్పుకొచ్చాడు శర్వానంద్. అయితే శర్వానంద్ మాటలని బట్టి చూస్తే సదరు యాంకర్ అడిగిన ప్రశ్న నిజమే అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి శర్వానంద్ సినిమాలలోకి రాకముందే బాగా ఇచ్చని సినిమాలలో వచ్చిన తర్వాత భారీగానే సంపాదించారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -