Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అమెరికా ప్రయాణం.. ఇంతకు ఎందుకో తెలుసా?

Pawan Kalyan: టాలీవుడ్ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ సినిమాలు కలిగిన హీరోలకు ఉండే క్రేజ్ పవన్ కళ్యాణ్ కు సొంత. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు గురించి మనందరికీ తెలిసిందే. తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో కుర్రకారుని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రస్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక పవన్ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయం కూడా ఒక అడుగు ముందే ఉన్నాడు. సొంతంగా జనసేన పార్టీ నిర్మించి జనసేన పార్టీ అధినేతగా తెలుగు రాష్ట్రాల ప్రజలలో రాజకీయంగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం జనసేన అధినేత అమెరికా బయలుదేరినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్ళినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో జనసేన అధిపతి ఉన్నట్టుండి అమెరికా వెళ్లడానికి కారణం ఏమిటి అని విశ్వసనీయ వర్గాల్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ అమెరికా ఎందుకు వెళ్లారు అనేదానిపై క్లారిటీ లేదు. కొందరు తన వ్యక్తిగత పనిమీద అమెరికా వెళ్లారు అని సూచిస్తున్నారు. మరికొందరు అక్కడ మీటింగ్ ఉందని దానికోసం పవన్ వెళ్లారని వార్తలు గుప్పిస్తున్నారు. అసలు ఈ రెండు కాదు హెల్త్ చెకప్ కోసం పవన్ అమెరికా వెళ్లారని కొందరు అనుకుంటున్నారు.

మొత్తం మీద పవన్ కళ్యాణ్ అమెరికా ఎందుకు వెళ్లారు అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక పవన్ అమెరికా పర్యటనపై క్లారిటీ రావాలంటే.. తన తదుపరి అప్ డేట్ కోసం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా బిజీగా ఉన్నాడు. ఎలాగైనా ఏపీ సీఎం సీటును తాను దక్కించుకొని, ఏపీ ప్రజలకు న్యాయం చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -