NTR: రోజు రోజుకి ముదురుతున్న యూనివర్సిటీ వివాదం.. ట్రోలింగ్ కి గురైన తారక్!

NTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఎంతో అసౌకర్యవంతంగా ఉండటమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కాస్త విష్మయానికి గురిచేస్తున్నాయి.వైయస్సార్ తరహాలోనే వైఎస్ఆర్ కన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ ను అదే స్థాయిలో పాలించిన నాయకులలో నందమూరి స్వర్గీయ రామారావు గారు ఒకరు. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో రాజకీయాలలో కూడా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు.

ఇప్పటికీ ఎన్టీఆర్ పాలన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారంటే అప్పట్లో ఆయన ప్రజలకు ఎలాంటి స్వచ్ఛమైన పరిపాలన అందించారో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హయామంలో హెల్త్ యూనివర్సిటీకి తన నామకరణం చేయగా అప్పటినుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరుతోనే కొనసాగుతోంది.అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఎన్టీఆర్ పేరును తొలగించే వైయస్సార్ పేరు పెట్టడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

ఈ విధంగా ఎన్టీఆర్ పేరును తొలగించడం పట్ల తెలుగుదేశం నేతలు మాత్రమే కాకుండా నందమూరి అభిమానుల సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై నందమూరి తారక రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఎన్టీఆర్ వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులే..ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టినంతమాత్రాన ఎన్టీఆర్ స్థాయి తగ్గదు వైయస్సార్ కీర్తి ప్రతిష్టలు పెరుగవు అంటూ ట్వీట్ చేశారు.

ఈ విధంగా ఎన్టీఆర్ ట్వీట్ చేయడం పట్ల తెలుగుదేశం అనుకూల మీడియా ఈ విషయంపై పెద్ద ఎత్తున డిబేట్ లు పెట్టి మరి ఎన్టీఆర్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావన చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ డిబేట్ లో ఎన్టీఆర్ పై ఏకంగా బూతులు తిట్టారు. ఎన్టీఆర్ టెంపర్ లేని బాద్ షా అంటూ ఎన్టీఆర్ ను ఎంతో అవమానకరంగా మాట్లాడారు. ఇక ఈ విషయంపై ఏకంగా న్యూస్ చానల్స్ యూట్యూబ్ థంనైల్ పెట్టి మరి ఎన్టీఆర్ ను దారుణంగా అవమానిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడంతో ఈ వివాదం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి కాకుండా ఎన్టీఆర్ మెడకు చుట్టుకుంది అనే చెప్పాలి. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -