Volunteers: వాలంటీర్లకు షాకుల మీద షాకులు.. వైసీపీ నిర్ణయం రైటేనా?

Volunteers: ఏపీ సీఎం జగన్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేన కవలకుండా ఉండటానికి ప్రయత్నించారు. ఢిల్లీ నుంచి కూడా లాబీయింగ్ చేయించారు. కానీ, కుదరలేదు. దానికి బోనస్ గా టీడీపీతో బీజేపీ కూడా జత కడుతోంది. తాము చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, సంక్షేమం విషయంలో అన్ని వర్గాలు హ్యాపీగా లేరు. 10 రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు పన్నుల రూపంలో లాక్కొంటున్నారనే అభిప్రాయంలో ఉన్నారు ప్రజలు. అంతేకాదు.. అభివృద్ధి లేని సంక్షేమం ఏపీ దివాళా తీయించిందనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో, జగన్ నమ్ముకున్నది వాలంటీర్లనే. జగనన్న నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్లు అంటించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు జగన్ నమ్మకం మీరే అని వాలంటీర్లు దగ్గర చెబుతున్నారు.

 

దీన్ని ముందే ఊహించిన టీడీపీ, జనసేన.. ఎలక్షన్ డ్యూటీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని నియమించొద్దని ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ కూడా ఆమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలు దిక్కరించి వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు… ప్రస్తుతం వాలంటీర్ల దగ్గర ఉన్న ప్రభుత్వ సెల్ ఫోన్లు ఈసీ ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. దీంతో.. వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈసీ కాదు.. వాలంటీర్లను ఏకంగా ప్రభుత్వమే తొలిగిస్తోందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వాలంటీర్లకు గిప్ఠులు పంపిణీకి 250 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులను 500 కోట్ల రూపాయలకు పెంచి వారికి పంచనున్నారు. ఆ తర్వాత వారిని విధుల నుంచి తొలగిస్తారు. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పనున్నారు.

ఎందుకీ పిచ్చి పని అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. వాలంటీర్ గా వారు ఎన్నికల్లో పని చేయకూడడు. వాలంటీర్ ఉద్యోగం లేకపోతే.. ఓ కార్యకర్తగా పని చేయొచ్చు. అప్పుడు ఈసీ కాదు కదా.. సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. సో.. వాలంటీర్ల దగ్గర ప్రజలకు సంబంధించిన సమాచారం ఎలాగూ ఉంది కనుక.. వారిని నయానో భయానో బెదిరించి ఓట్లు దండుకోవాలని వైసీపీ అధినేత ప్లాన్.

 

ప్లాన్ బాగుంది కానీ.. ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చెప్పలేం. వాలంటీర్లకు ఉద్యోగం ఊడిపోతే వారు స్వేచ్చా పక్షులు. వైసీపీ వారి మాట మాత్రమే వినాలని లేదు. టీడీపీ వాళ్లు కూడా ఎక్కువ డబ్బు ఇచ్చి తమ వైపు తిప్పుకునే ఛాన్స్ ఉంది. ఏదైనా జరగొచ్చు. అంతేకాదు, వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువగా అంసతృప్తితో ఉన్నారు. ఐదేళ్లుగా 5 వేల జీతంతో ఊడిగం చేస్తున్నామని భావిస్తున్నారు. అడపా దడపా అలాంటి కామెంట్స్ బహిరంగంగా చేసిన వాళ్లు ఉన్నారు. అలాంటివారికి రేపు ఎన్నికల తర్వాత మళ్లీ వాలంటీర్ గా నియమిస్తారని గ్యారెంటీ లేదు. ప్రస్తుతం వైసీపీ నేతలతో స్థానికంగా విభేధిస్తున్న వాలంటీర్లకు ఎన్నికల తర్వాత వైసీపీ గెలిస్తే పోస్టింగ్ పడే ఛాన్స్ లేదు. దీంతో.. వాలంటీర్లు కూడా పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకుంటారని చర్చ జరుగుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -