Rajinikanth-Chiranjeevi: రజనీకాంత్ ను చూసి చిరంజీవి నేర్చుకోవాలా.. భోళా శంకర్ చూసిన ఫ్యాన్స్ అభిప్రాయమిదే!

Rajinikanth-Chiranjeevi: సూపర్ స్టార్ రజినీకాంత్ తను వయసుకు తగ్గట్టుగా కాకపోయినా కొంచెం చేసే సినిమాలో పాత్రలకు తగ్గట్టుగా ఆ లుక్స్ గాని స్టైల్ గాని మెయింటైన్ చేస్తున్నారు. మనం చూసినట్టు అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ముందు సినిమాలు కబాలి, రీసెంట్ గా విడుదలైన జైలర్ లలో పాత్రలు తనకి తగ్గట్టుగా తనని ఎలివేట్ చేసేలాగా ఉన్నాయి. గత పదేళ్ల నుంచి ఒక సూపర్ హిట్ కూడా లేని రజనీకాంత్ కి జైలర్ సినిమాతో సూపర్ హిట్ దక్కేలాగే కనిపిస్తుంది.

దర్శకుడు నెల్సన్ శైలిలో నటిస్తూ సినిమా అంతా మంచి మంచి ఎలివేషన్లతో పాటలతో సూపర్స్టార్ యాక్షన్ తో బాగా తీశారు. మరోవైపు బాలకృష్ణ కూడా తన వయసుకు తగ్గట్టుగా అఖండ మరియు వీరసింహారెడ్డిలలో అల్లరించారు. అనిల్ రావిపూడి దర్శకంలో వస్తున్న సినిమాలో కూడా ఒక టీనేజ్ అమ్మాయి యొక్క తండ్రి పాత్రను పోషించనున్నారు బాలకృష్ణ. అటు తమిళంలో కమల్ హాసన్ కూడా తనకు ఇచ్చిన పాత్రలలో ఎలివేషన్లు ఇస్తూ విక్రమ్ వంటి చిత్రాలలో బాగా కనిపించారు.

 

కానీ మెగాస్టార్ మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు. తన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలలో యంగ్ గా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో కొంచెం బానే ఉన్నా భోళా శంకర్లో కూడా మళ్లీ యంగ్ గా కనిపించి రొమాంటిక్ స్టిల్స్ ఇస్తూ యంగ్ హీరో గా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఎందుకు అలా చేయడం తన పాత్రకు తగ్గట్టుగా తన వయసుకు తగ్గట్టు సినిమాలు చేసుకోవడం మంచిది కదా.

 

హీరోయిన్లతో డ్యాన్సులు వేయడం ఐటమ్ సాంగ్లు చేయడం లాంటివి ఇంకెన్ని సంవత్సరాలు వరకు చేస్తారు. చిరంజీవి ఈ విషయంలో మాత్రం రజనీకాంత్ ను, కమల్ హాసన్ను, బాలకృష్ణను చూసి నేర్చుకోవాలని భోళా శంకర్ చూసిన తర్వాత అర్థమయింది. ఇప్పటికైనా తన పద్ధతి మారి తన వయసుకు సంబంధించిన సినిమాలు తీస్తే హిట్లు కొనసాగించవచ్చు. ఇక భోళా శంకర్ విషయానికొస్తే జైలర్ తో పోటీగా వచ్చినా జైలర్ ముందు ఓడిపోయిందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -