Prabhas: ప్రభాస్ మరో ఆపరేషన్ చేయించుకోవాలా.. ఆ నొప్పులకు మందులు లేవా?

Prabhas: తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.

 

కోట్ల బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదల అయ్యి అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కి మోకాలికి గాయం ఎప్పటినుంచో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ఆ నొప్పిని భరిస్తూనే మరొకవైపు అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు ప్రభాస్. మొన్నటికి మొన్న సలార్ సినిమా ప్రమోషన్లకు ముందు ప్రభాస్ తన మోకాలికి సర్జరీ చేయించుకొని నెల రోజులపాటు యూరప్ లో ఉండి మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఇండియాకు తిరిగి వచ్చేవరకు అభిమానులు చాలా ఆందోళన చెందారు.

ఇది ఇలా ఉంటే అంతా సర్దుకుందని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరోసారి ఆయన గాయం తిరగబెట్టిందని సమాచారం. దీంతో మరోసారి ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్టు టాక్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోలన చెందుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావస్తోంది. మే9 విడుదల తేది కూడా ఇచ్చారు. ఈ లోగ కాస్త బ్రే తీసుకొని చికిత్సకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -