Sita Ramam Review: సీతారామం సినిమా రివ్యూ

విడుదల తేది: ఆగస్ట్‌ 05,2022
నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌,మృణాల్‌ ఠాగూర్‌, సుమంత్‌, రష్మిక, తదితరులు
నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
నిర్మాత: అశ్వినీదత్‌
దర్శకత్వం: హను రాఘవపూడి
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ – శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

Sita Ramam Review and Rating

హను రాఘవపూడి సినిమాలకు సపరేట్ ఓ సెక్షన్ ఉంటుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రేమ కథలను తెరకెక్కించడంతో ఆయనకు ఆయనే సాటి. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, పడి పడి లేచే మనసు సినిమాలతో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు సీతారామం అంటూ మరోసారి తన లక్‌ను పరీక్షించుకునేందుకు వచ్చాడు. మరి సీతగా మృణాల్ ఠాకూర్, రామ్‌గా దుల్కర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూడాలి.

కథ: సీతారామం కథ అంతా కూడా 1985లో జరుగుతుంది. కానీ దాని నేపథ్యం మాత్రం 1965లో ఉంటుంది. లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్), సీతా మహాలక్ష్మీ (మృణాల్ ఠాకూర్) మధ్య నడిచిన ఉత్తరాలే ఈ సీతారామం. సీత రాసిన లేఖలు రామ్‌లో ఎలాంటి చలనం కలిగింది. చివరి క్షణంలో రామ్ రాసిన ఉత్తరం సీతకు ఎలా చేరింది? అసలు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? ఈ కథలో అఫ్రీన్ (రష్మిక మందన్న), విష్ణు శర్మ (సుమంత్) పాత్ర ఏంటి? రామ్ రాసిన చివరి లేఖలో ఏముంది? సీతారాములు ఒక్కటయ్యారా? లేదా? అన్నదే కథ.

నటీనటుల పనితీరు: దుల్కర్ సల్మాన్ నటనకు వంక పెట్టగల నటులు ఈ దేశంలో లేరు. ఆయన ఎంత చక్కగా నటిస్తారో.. పాత్రకు తగ్గట్టుగా ఎలా ఒదిగి పోతారో అందరికీ తెలిసిందే. ఇక ఇందులో రామ్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా కనిపిస్తాడు. కళ్లతోనే నటించేస్తాడు. రామ్‌ను తెరపై చూస్తున్నంతసేపు ఏదో తెలియని కొత్త అనుభూతి, భావన కలుగుతుంది. ఇక సీతగా అయితే మృణాల్ మాయ చేస్తుంది. ఆమె హావాభావాలు, నడవడిక, అల్లరి, కొంటె చూపులు, చేష్టలు అన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రష్మిక పాత్ర ఇందులో చాలా కీలకం. ఆమె కూడా అంతే చక్కగా నటించింది. సుమంత్‌కు ఇది చాలా కొత్త పాత్ర. ఇందులో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. గౌతమ్ మీనన్, సచిన్ ఖేదెకర్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్ ఇలా అంతా కూడా పర్వాలేదనిపిస్తారు.

విశ్లేషణ…
హను రాఘువపూడి కథ, కథనం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కథనం చాలా స్లోగా ఉంటుంది. కానీ కథ కనెక్ట్ అయితే.. అందులో మనం ఎంత నెమ్మదిగానైనా ప్రయాణిస్తాం. సీతారామం కూడా అలాంటిదే. రామ్ కథకు మనం హుక్ అయిపోతాం. అందుకే కథనం కాస్త స్లోగా అనిపించినా.. మనం అందులో లీనమవుతాం. సీత కోసం పరితపిస్తాం. సీతారాములు ఎప్పుడు కలుస్తారా? అని చూస్తుంటాం. ఈ కథ, కథనం, మాటలు మాత్రం ఇంకొన్నేళ్లు వెంటాడుతూనే ఉంటాయి.

సీతారామం కథకు తగ్గట్టుగా ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. అవి నిజంగానే సెట్సా? అనే ఆలోచన ఎక్కడా కూడా రానివ్వలేదు. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. నాటి ప్రేమకు ఉండే అర్థాన్ని చూపించారు. ప్రేమ అంటే హద్దులు దాటే శృంగారం అని భావించే వారికి ఈ చిత్రం ఓ కనువిప్పులా ఉంటుంది. ఎక్కడా అశ్లీలత లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే హను ప్రత్యేకతను చూపిస్తుంది.

హను రాఘవపూడి ఊహకు.. కెమెరామెన్ విజువలైజేషన్ తోడైంది. కెమెరాపనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాశ్మీర్‌లోనే ఉన్నామా? అనే భ్రమ కలిగించేలా ఉంటాయి విజువల్స్. ఇక సంగీతం అయితే మనసును హత్తుకుంటుంది. పాటలు వినడానికి, చూడటానికి ఎంతో గొప్పగా అనిపిస్తాయి. మాటలు మన మెదళ్లలో నాటుకుపోతాయి. ఎడిటింగ్ నిర్మాణ విలువలు అన్నీ కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి.

ప్లస్ పాయింట్స్… 

దుల్కర్, మృణాల్
కథ
డైరెక్షన్
సంగీతం, ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్…

కాస్త స్లోగా సాగే కథనం

రేటింగ్: 3.5/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -
విడుదల తేది: ఆగస్ట్‌ 05,2022 నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌,మృణాల్‌ ఠాగూర్‌, సుమంత్‌, రష్మిక, తదితరులు నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాత: అశ్వినీదత్‌ దర్శకత్వం: హను రాఘవపూడి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌ సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు Sita Ramam Review and Rating హను రాఘవపూడి సినిమాలకు సపరేట్ ఓ సెక్షన్ ఉంటుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రేమ కథలను తెరకెక్కించడంతో...Sita Ramam Review: సీతారామం సినిమా రివ్యూ