Sr NTR – ANR: ఆ గొడవ కారణంగా మల్టీస్టారర్ సినిమాలకు కూడా దూరమయ్యారా?

Sr NTR – ANR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ నటులు గురించి చెప్పాల్సి వస్తే ముందుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. వీరు ఇండస్ట్రీలోకి రాకముందే ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఎన్టీఆర్ ఏఎన్నార్ చిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పాలి.ఇలా ఎన్నో విభిన్న కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలు ఇద్దరు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంబినేషన్లో దాదాపు పది సినిమాలకు పైగా మల్టీ స్టార్ సినిమాలలో చేసి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులను, ఏఎన్ఆర్ అభిమానులను సందడి చేశారు. ఇకపోతే ఈ హీరోలు ఇద్దరు కేవలం కుటుంబ కథా చిత్రాలలో మాత్రమే కాకుండా ప్రేమ కథ చిత్రాలలో కూడా దిట్ట అని చెప్పాలి.

ఇకపోతే ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలలో కూడా ఎన్నో పాత్రలలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అర్జునుడు కృష్ణుడు వేషంలో ఎన్టీఆర్ కి ఎవరు సాటిరారని చెప్పాలి.అయితే ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ హీరోలు ఇద్దరి మధ్య ఒక సినిమా విషయంలో మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది. ఒక పౌరాణిక చిత్రంలో భాగంగా ఎన్టీఆర్ అర్జునుడు వేషం వేయగా, ఏఎన్ఆర్ కృష్ణుడు వేషం వేయమని చెప్పారట.అయితే కృష్ణుడిగా నటించడం కోసం ఏఎన్ఆర్ తిరస్కరించడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది.

కృష్ణుడి పాత్రలు అంటేనే అందరికీ టక్కున అన్నగారు మాత్రమే గుర్తుకు వస్తారు అలాంటి కృష్ణుడి పాత్రకు తాను సూట్ కానని అందుకే తాను నటించనని ఏఎన్ఆర్ చెప్పడం వల్లే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని, ఈ మనస్పర్ధలు కారణంగా కొద్దిరోజులపాటు వీరిద్దరికి మాటలుమాత్రమే కాకుండా ఇద్దరు కలిసి తదుపరి మల్టీ స్టార్ చిత్రాలు కూడా చేయలేదని తెలుస్తోంది. ఇలా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరితో పని చేసే ఇతర నటీనటులు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -