Prabhas: ప్రభాస్ పక్కన నటించి తప్పు చేశాను.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్ పక్కన నటించినందుకు తప్పుగా ఫీల్ అవుతోందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రద్ధ కపూర్.

ఆషికీ 2 సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రద్ధ అనూహ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియన్ సినిమా సాహో. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన ఈ సినిమా బాకాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది. బాహుబలి రెండు భాగాలలో ప్రభాస్ ఎంత హ్యాండ్సం గా కనిపిస్తాడో సాహో సినిమాలో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. లుక్ దగ్గర్నుంచే ఈ సినిమాకి నెగిటివిటీ ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా కథ, కథనం సాహో ఫ్లాప్ కి కారణం అయితే హీరోయిన్‌గా నటించిన శ్రద్ద కపూర్ మరో కారణం అయింది. అసలు శ్రద్దాని ఈ సినిమా కోసం ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు.

సౌత్ లో ఫ్లాపైనా బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా 150 కోట్లు వసూలు చేసి అక్కడ ప్రభాస్ మార్క్ ని ఇంకాస్త పెంచింది. ఈ సినిమాకి కాస్త ఊరట ఉంది అంటే ఇదొక్కటే. భారీగా రెమ్యునరేషన్ ఇచ్చిన శ్రద్ద కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండస్ పెద్ద మైనస్ అయ్యారు. దర్శకుడు సుజీత్ మేకింగ్ గురించి మాత్రం అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో గొప్పగా మాట్లాడుకున్నారు. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల చిరంజీవితో వచ్చిన ఛాన్స్ కూడా సుజీత్ కి మిస్సైంది. మళ్ళీ ఇంత కాలానికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు.

అయితే, ఎప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీపైన ఆశలు పెట్టుకునే బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ మంచి లాంఛింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అలా ఎదురు చూసిన శ్రద్ధకి వచ్చింది మంచి ఛాన్స్ అయినా అది డిజాస్టర్ కావడంతో చాలా డిసప్పాయింట్ అయింది. ప్రభాస్ కాకుండా మరో యంగ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటే టాలీవుడ్ లో తన కెరీర్ బావుండేదేమో అని నీరుకారిపోతుందట. ఈ విషయంలో ఆమె ప్రభాస్ పక్కన నటించిన తప్పు చేశానని ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -