Sharmila: షర్మిల విషయంలో వింత అనుమానాలు.. అసలేం జరిగిందంటే?

Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత హస్తం పార్టీలో దూకుడు పెరిగింది. నిన్న మొన్నటి వరకూ ఎక్కడున్నారో తెలియని క్యాడర్ ఒక్కసారిగా యాక్టీవ్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే ఏపీలో రానున్న ఎన్నికల్లో షర్మిల, కాంగ్రెస్ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక, క్షేత్రస్థాయిలో భారీగా చేరికలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది కాంగ్రెస్‌లో చేరడాని సిద్ధంగా ఉన్నా.. భవిష్యత్ పై పలు ప్రశ్నలు తలెత్తడంతో ఓ అడుగు వెనక్కి వేస్తున్నారు. షర్మిల నిలకడలేని తనంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను నమ్ముకొని కాంగ్రెస్ లో చేరితే భవిష్యత్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.

 

వారి ఆలోచనలో అర్థం లేకపోలేదు. తెలంగాణలో ఓ పార్టీ పెట్టి.. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దానికి తగ్గట్టు అడుగులు వేయడంలో తప్పులేదు. కానీ, నమ్ముకున్నవారి గురించి కూడా ఆలోచించాలి కదా? షర్మిలను నమ్ముకొని వైఎస్‌ఆర్టీపీలో చేరిన వారి పరిస్థితి గురించి ఆలోచించకుండా తన దాని తాను చూసుకున్నారు. కనీసం చిన్నా చితక పదవులు అయినా ఇప్పించకుండా వారి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడేసి ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీ వచ్చేశారు. మరి, ఇప్పుడులో ఆమెను నమ్ముకొని కాంగ్రెస్ లో చేరితే.. ఆమె ఆ పార్టీలో ఎంత వరకు కొనసాగుతారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఆమె కాంగ్రెస్ ను కూడా విదిలేస్తే.. అప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ కేంద్రంలో గెలిచే సూచనలు కనిపించిన రోజు ఏపీలో బలపడే అవకాశం ఉంది. కానీ, అంతవరకూ కష్టమే. దీంతో, షర్మిల మరోదారి చూసుకుంటే.. మేం గోదారి చూసుకోవడమే అనుకుంటున్నారు నేతలు. పైగా షర్మిల తన అన్నతో ఆస్తి తగాదాలు ఉండటం వలన ఆయనపై రివేంజ్ తీసుకోవడానికే కాంగ్రెస్ ను ఎంచుకుంది. కానీ, కాంగ్రెస్ తో అది సాధ్యంకాదని అనిపించిన రోజు మరో దారి చూసుకుంటారని విశ్లేషణలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లతో వైసీపీ గెలిస్తే.. షర్మిల చేసేదేమి లేక జగన్ తో మంతనాలు జరపొచ్చు. ఒకవేళ టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే జరిగిన నష్టాన్ని గుర్తించి జగనే షర్మిలకు కబురు పెట్టొచ్చు. అన్నా చెళ్లెల మధ్య ఉన్న పంచాయితీ సెటిల్ అయిపోతే.. షర్మిలకు కాంగ్రెస్‌లో ఉండే అవసరం ఉండదు. కానీ, అప్పటికే కాంగ్రెస్‌లో చేరిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -