Rayalaseema: రాయలసీమలో కూడా వైసీపీ సీటు జరుగుతోందా.. ముస్లిం కార్డ్ అక్కడ పని చేయట్లేదా?

Rayalaseema: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైయస్సార్సీపి పార్టీ సింగిల్ గా పోటీ చేస్తూ ఉండగా తెలుగుదేశం బిజెపి జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో భాగంగా ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహించాయి.

ఈ సర్వేలలో భాగంగా కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది.ఇకపోతే వైఎస్ఆర్సిపి పార్టీకి కంచు కొట్టుకో ఉన్నటువంటి రాయలసీమలో కూడా కూటమికి మద్దతు లభించడం గమనార్హం. ఇటీవల కర్నూలు ఆదోనిలో నిర్వహించినటువంటి సర్వేలో భాగంగా వైసీపీకి బలం తగ్గి కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోందని వెళ్లడైంది.

తాజాగా స్ట్రా పోల్ సంస్థ కర్నూలు జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని తేల్చి చెప్పింది. కర్నూలులో తెలుగుదేశం పుంజుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న కర్నూలులో, అదీ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా బీజేపీకి అభ్యర్థి పోటీ చేస్తున్నారు.

ఆదోనిలో పెద్దగా బిజెపికి మద్దతు తెలిపేవారు లేరు. అంతేకాకుండా అక్కడ కూడా మైనారిటీలు జగన్ పాలనను వ్యతిరేకిస్తూ కూటమికే మద్దతు తెలుపుతూ ఉండటం గమనార్హం. ఇలా ఆదోని కర్నూలు వంటి ప్రాంతాలలో వైసిపికి ఎంతో బలం ఉన్నప్పటికీ అక్కడ కూటమికే మద్దతు లభించడంతో రాయలసీమలో కూడా వైసిపి కంచుకోటలు బద్దలు కాబోతున్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -