Sunitha Reddy: చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న సునీతా రెడ్డి.. అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదా?

Sunitha Reddy: రెండు ఎన్నికలను శాసించిన ఒక అంశం ఉండటం చాలా అరుదు. కానీ, ఏపీ రాజకీయాల్లో వివేకాహత్య కేసు రెండో ఎన్నికలో కూడా ప్రధానంగా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఇదే పెద్ద అస్రంగా మారింది. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివేకాహత్య కేసు రాయలసీమలో ప్రభావం చూపించబోతోంది. గత ఎన్నికల్లో వివేకాహత్యను వైసీపీ చాలా వ్యూహాత్మంగా వాడుకుంది. మొదట గుండెపోటుతో మృతి చెందారని వైసీపీ తన సొంత మీడియాలో వార్తలను ప్రచురించింది. కాసేపటికి రక్తపు వాంతులతో మృతి చెందారని చెప్పుకొచ్చారు. మళ్లీ స్వరం మార్చి వివేకానందరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారని అన్నారు. ఓటమి భయంతో ప్రజలను భయాందోళనకు గురి చేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో జగన్ డిమాండ్ చేశారు. దీన్ని డిఫెండ్ చేసుకోవడం తప్ప చంద్రబాబు రెండో ఆఫ్షన్ లేకుండా పోయింది. నిజానికి సడెన్ గా వచ్చిన ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో కూడా చంద్రబాబుకి తట్టలేదు. కానీ.. సొంత బాబాయ్ ని పోగొట్టుకున్నాడనే సింపతీ మాత్రం జగన్‌కు వర్క్ అవుట్ అయింది. రెండు నెలలు తిరిగే సరికి జగన్ సీఎం అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ కేసును పక్కన పెడతూ వచ్చారు. సీబీఐ విచారణ అవసరం లేదని.. తామే విచారణ చేస్తామని చెప్పారు. కొన్ని రోజులకు వివేకా హత్యలో రాజకీయ కుట్రల లేవని.. కుటుంబ కలహాలే కారణమని వైసీపీ ప్రచారం చేసింది. అంతేకాదు.. ఈ హత్యకు మతం రంగు కూడా పులిమింది. ఓ ముస్లిం మహిళతో వివేకాకు వివాహేతర సంబందం ఉందని.. ఆమెతో పుట్టిన కుమారుడికి ఆస్తి ఇచ్చేందుకు వివేకా సిద్దమయ్యారని ప్రచారం చేసింది. అక్రమ సంతానానికి ఆస్తి ఇవ్వడం ఇష్టం లేక వైఎస్ సునీత, తన భర్త ఆయన్ని హత్య చేశారని చెప్పుకొచ్చారు.

అప్పుడు వివేకా కుమార్తె సునీతకు జ్ఞానోదయం జరిగింది. జగన్ ఆ కేసును తనపైనే నెట్టేశారని అనుకున్నారు. నిజానికి గత ఎన్నికల ముందు ఈ కేసు విషయంలో మౌనంగా ఉండి తప్పు చేశానని.. తనకు పడాల్సిన శిక్ష పడిందని అనుకున్నారు. తండ్రి మరణం గత ఎన్నికల్లో అన్న జగన్ కు రాజకీయంగా ఉపయోగపడుతోందని ఆమె మౌనంగా ఉన్నారు. కానీ, వివేకా హత్యకేసు హంతకులననే కాపాడుతారని ఆమె అనుకోలేదు. అన్న కోసం అప్పుడు తండ్రి మరణాన్ని రాజకీయంగా వాడానని.. ఇప్పుడు అదే తనకు శాపంగా మారిందని ఆమె ఆవేదన చెందుతోంది. అప్పుడే హత్య గురించి నోరు విప్పి ఉంటే జగన్ చాఫ్టర్ ఐదేళ్ల క్రితమే క్లో జ్ అయ్యి ఉండేది. కానీ, అప్పటి మౌనం ఇప్పటి అరాచకానికి దారి తీసింది.

అందుకే ఆమె ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆమె రంగంలో దిగుతున్నారు. ఇప్పటకే ఆమె మీడియా సమావేశం పెట్టి వైసీపీకి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత చెల్లెలకు న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రం ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ఆమె ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -