Surekha: కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి భార్య.. కారణాలివే?

Surekha: తెలుగు సినీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం సినీ పరిశ్రమనే ఏలే స్థాయికి చేరుకున్నాడు. అయితే ఈ రేంజ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఫ్యామిలీ టెన్షన్స్ లేనప్పుడే కెరీర్ పరంగా రాణించగలం. అందుకే కాబోలు.. చిరంజీవి పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లో తన భార్య సురేఖ గురించి పొగుడుతూ వస్తుంటారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. మొదట అల్లు రామలింగయ్య అయితే.. మరొకరు తన భార్య సురేఖ అని చెప్పుకొచ్చాడు. తాను సినిమా షూటింగ్స్‌ లో బిజీగా ఉన్నప్పుడు సురేఖనే ఇంటి బాధ్యతలు చేపట్టారని, ఇంటి బాధ్యతల విషయంలో సురేఖ తనను ఏనాడు ఇబ్బంది పెట్టలేదన్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణం సురేఖనే అని గర్వంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు.

 

 

అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే చిరంజీవి-సురేఖ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరిగేవంట. ఒకసారి చిరంజీవి మాటలకు సురేఖ కన్నీళ్లు పెట్టుకుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ సురేఖ-చిరంజీవి జంట చూడముచ్చటగా ఉంటుంది. చాలా మంది సినీ ప్రముఖులు చిరంజీవి-సురేఖను చూసి అందరూ ఆదర్శంగా ఉండాలని సలహాలు ఇస్తుంటారు. అయితే పెళ్లైన తర్వాత ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు చిరంజీవి సురేఖపై అరిచేసారట. దాంతో సురేఖ కన్నీళ్లు పెట్టుకుందట. సురేఖ కన్నీళ్లు పెట్టకోవడానికి రీజన్ ఏమిటో తెలుసా? అయితే చిరంజీవి విహారయాత్రకు వెళ్దామని సురేఖను రెడీగా ఉండమని చెప్పాడట. అయితే అప్పుడే సినిమా షూటింగ్ వాయిదా పడింది. టూర్‌కు వెళ్లాల్సిన రోజే షూటింగ్ జరిగింది. చిరంజీవి ఈ విషయాన్ని సురేఖకు చెప్పడం మర్చిపోయాడు. టూర్‌కు వెళ్లాలనే హడాహుడిలో సురేఖ లగేజ్ ప్యాక్ చేసుకుని చిరంజీవి కోసం వెయిట్ చేసింది. ఎంత టైం అయినా చిరంజీవి రాకపోవడంతో.. కాల్ ట్రై చేసింది. మొదటి కాల్‌కు ఆన్సర్ ఇవ్వకపోవడంతో భయపడిన సురేఖ వరుసగా కాల్స్ చేయడం మొదలు పెట్టింది. అన్ని సార్లు కాల్స్ చేయడంతో విసిగిపోయిన చిరంజీవి.. కోపంలో సురేఖపై అరిచేశాడట. ఆ తర్వాత తనదైన స్టైల్‌లో సురేఖను కూల్ చేశాడట.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts