Asia Cup 2022: సూర్య పరుగుల వర్షానికి విరాట్‌ ఫిదా!

Asia Cup 2022: విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ పట్టాడండే ఇక పరుగుల వరదే. అతడి ఆటకు ప్రముఖ ఎంతో మంది అభిమానులు, తోటి క్రీడాకారులు మంత్రముగ్ధులవుతారు. ప్రముఖ క్రీడాకారులు సైతం అతని ఆటను ఒక్కోరకంగా విశ్లేశిస్తుంటారు. కానీ.. అలాంటి కోహీ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆటకు ఫీదా అయిపోయాడు. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ శివతాండవం ఎత్తి పరుగుల వర్షాన్ని కురిపించాడు. చాలా రోజుల తర్వాత కోహ్లీ అర్ధశతకంతో సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ ముందు అది కూడా చిన్నబోయింది. 26 బంతులు ఆడిన సూర్య 6 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టి 68 పరుగులు చేశాడు. నాన్‌స్ట్రైకర్‌లో ఉండి సూర్య ఆట తీరును గమనిస్తున్న కోహీ బౌ డౌన్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌ను గౌరవించాడు.

ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ నుంచి ఇలాంటి ఊహించని గౌరవం పొందడంతో సూర్య సైతం గర్వంగా ఫిలవుతున్నాడు. అయితే.. విరాట్‌ కోహీ సూర్యకుమార్‌కు బౌ డౌన్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ లాంటి లెజెండ్‌ సూర్య ఇన్నింగ్స్‌కు ఫిదా అవ్వడంపై ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌కు దినేష్‌ కార్తీక్‌ బౌ డౌన్‌ చేశాడు. ఇప్పుడు సూర్యకు కోహ్లీ బౌ డౌన్‌తో గౌరవించడంతో టీమిండియాలో మంచి స్నేహ వాతావరణం ఉంది. ఆటగాళ్లు ఒకరి సక్సెస్‌ను మరోకరు ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారని ఈ పద్ధతి టీం ఇండియాకు మేలు చేస్తుందని క్రికెట్‌ విళ్లేషకులు పేర్కొంటున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే..మొదటి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులను చేసింది. మొదట పది ఓవర్లలో 70 పరుగులు టీం ఇండియా ఆ తర్వాత సూర్య మైదానంలోకి వచ్చి రెచ్చిపోవడంతో ఆ తర్వాతి 5 ఓవర్లో స్కోరో అమాతంగా పెరిగింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్‌ 20 ఓవర్లు ఆడి 5 వికెట్లు కోల్పోయి 152 పరుగుల వద్దనే ఆగిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -