Jagan: ఏపీ రైతులకు తీపికబురు.. వాళ్లకు జగన్ నిజమైన దేవుడు అనేలా?

Jagan: ఏపీ సీఎం జగన్ తాను చెప్పిన విధంగా ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి పథకాలను విడుదల చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు. రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టారు సీఎం జగన్. ఇది ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయనున్నారు.

రైతు దినోత్సవం సందర్భంగా ఇన్ పుట్ సబ్సిడిని రైతులకు అందించనున్నారు. దీంతో ఏపీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేయూతనిస్తున్నారు జగన్. ఈ క్రమంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రైతు దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి ఏటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం రోజునే రైతు దినోత్సవాన్ని జరుపుతుంది ప్రభుత్వం. ఈ సందర్బంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.

 

అనంతపురంలోని కళ్యాణ దుర్గంలో జరిగే సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 2022 ఖరీఫ్ కు సంబంధించి ఫసల్ భీమా పథకం కింద రూ.1,016 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా నేడు పవన్ కళ్యాణ్ అనంతపురంలోని కళ్యాణదుర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఖాతాలోకి డబ్బులను జమ చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -