T20 Cricket: 15 పరుగులకే 10 వికెట్లు..క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డు

T20 Cricket: టీ20 క్రికెట్ చరిత్రలో సంచలన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. 140 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఓ టీమ్ 15 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. టీ20 చరిత్రలో ఇంత తక్కువ పరుగులకు ఆలౌట్ అవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2022-23 టోర్నీలో ఈ సంఘటన జరిగింది. ఇండియాలో జరిగే ఐపిఎల్ లాగా ఆస్ట్రేలియాలో కూడా టీ20 జరుగుతోంది.

 

టోర్నీలో భాగంగా స్థానిక టీమ్స్ అయిన సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ జట్లు తలపడుతున్నాయి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసింది. ఆ తర్వాత సిడ్నీ స్ట్రైకర్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. 140 రన్స్ టార్గెట్ తో ఆ జట్టు రంగంలోకి దిగింది.

 

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అతి తక్కువ స్కోరుకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. మొత్తం 15 పరుగులు చేసి 10 వికెట్లనూ సమర్పించుకుంది. అది కూడా కేవలం 5.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఇది టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు కావడం విశేషం. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అందులో ముఖ్యంగా థార్న్‌టాన్ 2.5 ఓవర్లలో 3 రన్స్ ఇచ్చి, 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు.

 

అదే జట్టులోని మరో బౌలర్ అగర్ కూడా 2 ఓవర్లలో 6 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీయడం అద్భుతం అనే చెప్పాలి. ఇది వరకూ టీ20ల్లో తక్కువ స్కోరు రికార్డు టర్కీ పేరు మీద ఉండగా దానిని ఈ మ్యాచ్ చెరిపేసింది. టర్కీ జట్టు 2019లో చెక్ రిపబ్లిక్ చేతిలో 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటై రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆ రికార్డును సిడ్నీ స్ట్రైకర్స్ జట్టు తన పేరు మీద నమోదు చేసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -