T20 WC 2022: హ్యాట్రిక్ పడగొట్టి.. భువీ రికార్డును బద్దలుకొట్టి.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ పేసర్

T20 WC 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ యువ బౌలర్ జోషువా లిటిల్ సంచలనం సృష్టించాడు.  సూపర్-12లో భాగంగా నేడు అడిలైడ్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో జోషువా.. హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో ఐర్లాండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కడంతో పాటు మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక వికెట్లు (టీ20లలో) తీసిన బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

ఐర్లాండ్‌తో ముగిసిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున ఫిన్ అలెన్ (32), డెవాన్ కాన్వే (28), కేన్ విలియమ్సన్ (61), డారెల్ మిచెల్(31) లు రాణించారు. కివీస్ ఇన్నింగ్స్  19వ ఓవర్లో జోషువా లిటిల్  సంచలన ప్రదర్శన చేశాడు. ఆ ఓవర్లో జోషువా.. రెండో బంతికి విలియమ్సన్‌ను ఔట్ చేయగా తర్వాత రెండు బంతులకు నీషమ్, సాంట్నర్‌లను పెవిలయన్‌కు చేర్చాడు.  తద్వారా టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్ గా నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వీరులు వీళ్లే..

– బ్రెట్ లీ (2007లో బంగ్లాదేశ్‌పై)
– కర్టిస్ కంఫర్ (2021లో నెదర్లాండ్స్‌పై) (ఇతడు కూడా ఐర్లాండ్ ఆటగాడే)
– వనిందు హసరంగ (2021లో సౌతాఫ్రికాపై)
– కగిసొ రబాడా (2021లో ఇంగ్లాండ్‌పై)
– కార్తీక్ మెయ్యప్పన్ (2021లో శ్రీలంకపై)
– జోషువా లిటిల్ (2022లో న్యూజిలాండ్‌పై)

హ్యాట్రిక్  వికెట్లు తీయడంతో జోషువా ఈ మ్యాచ్‌లో మరో ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అతడు అగ్రస్థానానికి  చేరుకున్నాడు. భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు.

ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు :

– జోషువా లిటిల్ (2022లో 39 వికెట్లు)
– సందీప్ లమిచెన్ (2022లో 38 వికెట్లు)
– వనిందు హసరంగ (2021లో 36 వికెట్లు)
– తబ్రైజ్ షంషీ (2021లో 36 వికెట్లు)
– దినేశ్ నక్రానీ (2021లో 35 వికెట్లు)
– భువనేశ్వర్ కుమార్ (2022లో 35 వికెట్లు)

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కివీస్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది.   తద్వారా  కివీస్.. 35 పరుగులతో విజయం సాధించడమే గాక  సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -