T20 WC: కేక పుట్టించేలా ఫీల్డింగ్.. ఒంటి చేత్తో సిక్సర్‌ను సింగిల్‌గా మార్చేశాడు

T20 WC: సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో అన్ని రంగాల్లో ఆస్ట్రేలియా రాణించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డేవిడ్ మలాన్ సూపర్ సెంచరీ చేయడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

 

అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 45వ ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ కొట్టిన ఓ బంతి గాల్లోకి దూసుకెళ్లడంతో అందరూ సిక్స్ అని ఫిక్సయ్యారు. కానీ అనూహ్య రీతిలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు అష్టన్ అగార్ సూపర్ మ్యాన్ తరహాలో గాల్లోకి ఎగిరి బంతిని ఆపాడు. దీంతో సిక్స్ కాస్త సింగిల్‌గా మారిపోయింది. ఈ పరిణామంతో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు లైవ్ చూస్తున్న వారు నోరెళ్లబెట్టారు.

 

అంతకుముందు కూడా అగార్ ఫీల్డింగ్ నైపుణ్యాల కారణంగా లియామ్ డాసన్ రనౌట్‌గా వెనుతిరిగాడు. అదిరిపోయే రీతిలో అగార్ విసిరిన త్రో వికెట్లను గిరాటేయడంతో డాసన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఫీల్డింగ్‌లో రాణించిన అగార్ బౌలింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ తీయకుండా 62 పరుగులు సమర్పించుకున్నాడు. మరో స్పిన్నర్ జంపా మాత్రం 3 వికెట్లతో రాణించాడు. జంపా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చాడు.

 

హాఫ్ సెంచరీలతో రాణించిన టాప్ ఆర్డర్
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ రాణించడంతో ఆ జట్టు సులువుగా విజయం సాధించింది. డేవిడ్ వార్నర్(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 86), ట్రావిస్ హెడ్ (57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 69, స్టీవ్ స్మిత్(78 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 80 నాటౌట్) హాఫ్ సెంచరీలతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే శనివారం సిడ్నీ వేదికగా జరగనుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -