Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ ను బీభత్సంగా ఉపయోగిస్తున్న యూట్యూబ్ ఛానల్స్?

Aishwarya Rai: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోని ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున లాభాలను పొందుతున్నారు. అయితే వారి చానళ్లకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రావాలని అలాగే వ్యూవర్షిప్ అధికంగా రావాలని చాలామంది ఎన్నో రకాల గేమ్స్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రతికున్న వారిని కూడా చంపుతున్న దాఖలాలు ఏర్పడుతున్నాయి.

ఇలా థంబ్ నెయిల్ సంచలనంగా పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఇలా హెడ్డింగ్ ఒకటి లోపల కంటెంట్ ఒకటి ఇస్తూ వారి ఛానల్ లకు వ్యూయర్షిప్ పెంచుకుంటున్నారు. అయితే ఇలా వారి యూట్యూబ్ ఛానల్ లకు మంచి గుర్తింపు రావడం కోసం స్టార్ సెలబ్రెటీలను సైతం వదలడం లేదు.ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏకంగా ఐశ్వర్యరాయ్ తో ఇలాంటి గేమ్స్ ప్లే చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఫైర్ అండ్ బ్లడ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మరియు ‘హౌస్ ఆఫ్ డ్రాగన్స్’ సిరీస్లకు సంబంధించిన కంటెంట్ రెగ్యులర్ గా చూపిస్తున్నారు. ఇక ఈ చానల్స్ ద్వారా యానిమేషన్ వీడియోలు ..హెచ్ బీవో లైసెన్స్ పొందిన చిత్రాలున్నాయి. ఇకపోతే ఈ రెండు సిరీస్ ల నుంచి వివిధ నటీనటులు నుండి ఆడియో వ్యాఖ్యానం.. జార్జ్ RR మార్టిన్ యొక్క కొత్త పుస్తకాలపై అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా తమ వ్యూవర్స్ కోసం ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. హౌస్ మార్టెల్ మూలాల గురించి వివరించే తాజా వీడియో కోసం వారు ఐశ్వర్య రాయ్ చిత్రాన్ని థంబ్నెయిల్ గా ఉంచారు. అదేవిధంగా హెచ్ బి ఓ లోగో కూడా ఉంది.ఈ విధంగా ఐశ్వర్యరాయ్ ఫోటో పెట్టడంతో ఇందులో ఐశ్వర్యరాయ్ నటిస్తుందని చాలామంది భావించారు. నిజానికి ఇక్కడ ఐశ్వర్య రాయ్ యొక్క ఆ చిత్రాలు 2007లో తీసిన ‘ది లాస్ట్ లెజియన్’ చిత్రానికి సంబంధించిన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారు అయితే ఈ విషయంపై ఐశ్వర్యరాయ్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -