Telangana: తెలంగాణలో మారుతున్న సమీకరణలు.. కాంగ్రెస్ దే విజయమా?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు చూసిన తర్వాత గులాబీ పార్టీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వీరిద్దరిని కేసీఆర్ తన పార్టీ నుంచి బహిష్కరించారు ఇలా ఎప్పుడైతే కేసీఆర్ వీరిని బహిష్కరించారో ఆ సమయం నుంచి తెలంగాణలో రాజకీయాలలో సమీకరణాలు మారుతున్నాయని సదరు పార్టీ నేతలలో ఆందోళన మొదలైంది.

 

ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి శ్రీనివాసులరెడ్డి కృష్ణారావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఒకరు ఖమ్మం నుంచి మరొకరి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతాలలో విజయం సాధించడం ఖాయమని పలువురు భావిస్తున్నారు అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి ఈ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో మరో కొందరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లడంతో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ముప్పు ఏర్పడే పరిస్థితిలో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ముందు బీజేపీకి తర్వాత బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దెబ్బ ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ప్రత్యర్ధిపార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ బలపడటమేనని తెలుస్తోంది.తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఏకతాటిపై నిలబడితే తప్పకుండా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బలం కలుగుతోందని దీంతో కాస్త కృషి చేస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అందుకోవడం చాలా సులువైన మార్గమని భావిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇలా కాంగ్రెస్ పుంజుకోవడంతో గులాబీ నేతలలో గుబులు పుడుతోందని స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -