TDP Manifesto: పెళ్లి శుభలేఖపై సూపర్ సిక్స్ పథకాలు.. చంద్రబాబుపై అభిమానానికి ఇంతకంటే సాక్ష్యాలు కావాలా?

TDP Manifesto: ఉత్తరాంధ్ర ప్రజలకు అభిమానం ఎక్కువ. ఓ పార్టీ లేదా వ్యక్తిని నమ్మితే గుండెల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరిని ద్వేషించినా రిజల్ట్ అలాగే ఉంటుంది. 40 ఏళ్ల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది. ఏదో ఒక పార్టీకి మూకుమ్మడిగా అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజల స్టైల్. ఈ ప్రాంతం అసెంబ్లీ రిజల్స్ట్ కు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఉత్తరాంధ్ర సైకిల్‌కి స్పీడ్ ఎక్కువ అని అంటూ ఉంటారు. చంద్రబాబు విజనరీకి ఉత్తరాంధ్ర అభిమానులు బాగా ఎక్కువగా ఉంటారు. అందులోనూ ఆ మూడు జిల్లాల్లో యువత ఎక్కువ మంది టీడీపీతోనే ఉంటారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువ జంట చంద్రబాబు, టీడీపీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. గతేడాది చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో‌లో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వారి వివాహ ఆహ్వానపత్రికలో ముద్రించి బంధువులకు, స్నేహితలకు పంచారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణనాయుడు వలసకు చెందిన కృష్ణారావు వివాహం జరిగింది. కృష్ణారావు కుటుంబానికి టీడీపీ అంటే అమితమైన అభిమానం. దీంతో.. టీడీపీ మినీ మ్యానిఫెస్టోని తన వివాహ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఆ మ్యానిఫెస్టోలో చంద్రబాబుతో పాటు స్థానిక నేతల ఫోటోలు కూడా ముద్రించారు. టీడీపీ ప్రకటించిన ఆరు పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను అందులో వివరించారు. ఎవరికి ఏ పథకం వర్తింస్తుందని వివరంగా చెప్పారు.

ఈ వివాహ వేడుకకు బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన హాజరైయ్యారు. పెళ్లి కార్డుపై చంద్రబాబు నాయుడుతో పాటు బేబీ నాయన పోటో కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వరుడు కృష్ణారావు అన్నారు. ప్రస్తుతం ఆ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ ఆరు సంక్షేమ పథకాలు వివరాలను టీడీపీ జోరుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తుంది. వైసీపీ ఇంత వరకూ తన హామీలను ప్రకటించలేదు. కానీ, టీడీపీ మాత్రం ఐదు నెలల క్రితమే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ పథకాలు ప్రజలను ఆకర్షిస్తాయని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే, మేనిఫెస్టో విషయంలో చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ అయింది. ఏడాది క్రితం నుంచే కాంగ్రెస్ తన హామీలను ప్రకటించి ప్రచారం చేస్తూ వచ్చింది. ప్రజల్లోకి వాటిని విస్తృతంగా తీసుకొని వెళ్లింది. కాంగ్రెస్ గెలిస్తే ఏం ఇస్తుంది అనే దానిపై ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. కానీ, బీఆర్ఎస్ ఈ విషయంలో వెనకబడింది. అభ్యర్థులను ప్రకటన పూర్తి అయిన తర్వాత కేసీఆర్ తన మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఆ మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లే సరికి ఎన్నికలు కూడా అయిపోయాయి.

ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు మొదట సూపర్ 6 పేరుతో తన పథకాలను ప్రకటించారు. ఆ తర్వాత జనసేనతో కలిసి ఉమ్మడి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. అందులో మొత్తం 11 అంశాలు ఉన్నాయి. ఇలా ఇవి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయాయి. కానీ.. వైసీపీ ఇంకా ఒక్క హామీ కూడా ప్రకటించలేదు. పైగా కృష్ణారావు లాంటి టీడీపీ అభిమానులు వినూత్నంగా ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఇది టీడీపీకి ఊహించన లాభం చేస్తుందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -