Tea: రోజూ అన్ని కప్పులు బ్లాక్‌ టీ తాగాలట.. నిజమా?

Tea: ఇద్దరు స్నేహితుల కలవగానే మొదట వారు మాట్లాడుకునే మాట ‘టీ’ తాగుదామా.. టీ తాగడంలో కుల మత పేద, ధనిక అనే తేడా ఉండదు. టీ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ప్రముఖుల, రాజకీయ నాయకులు సైతం టీ విందుకు ఆహ్వానిస్తుంటారంటే టీ మహాత్యం ఇట్టే అర్థమవుతోంది. ఓ కప్పు టీ తాగితే ఆ జోష్‌ వేరే లెవెల్లో ఉంటుంది. మనస్సు బాగలేకపోయినా.. బాడీ డల్‌ అవుతున్నట్లు అనిపించినా వేడి వేడి టీ ఓ కప్పు టీ కడుపులో పడితే అప్పుడొచ్చే ఉల్లాసమే వేరు.

ఆరోగ్య ప్రదాయినిగా భావించే టీలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో.. పాలు కలపని బ్లాక్‌ టీ(డికాషన్‌) కూడా ఒకటి. బ్లాక్‌ టీతో విశేష లాభాలు ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. రోజుకు రెండు మూడు కప్పులు బ్లాక్‌ టీ తాగితే దీర్ఘాయుష్షు కలుగుతుందట. మనిషికి మరణాన్ని కలిగించే అన్ని శారీరక రుగ్మతల నుంచి బ్లాక్‌ టీ కాపాడుతుందట. అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ అనే జర్నల్‌ లో దీనికి సంబంధించిన అధ్యయనం ప్రచురితమైంది.

అందరికతో పోల్చుకుంటే బ్లాక్‌ టీ తాగేవారిలో మరణాల ముప్పు తక్కువని పరిశోధకులు వెల్లడించారు. బ్రిటన్‌ లో 40 నుంచి 69 ఏళ్ల వయసున్న సుమారు 5 లక్షల మంది స్త్రీపురుషులపై ఈ అధ్యయనం నిర్వహించారు. 2006– 2010 మధ్య కాలంలో వారి జన్యు, ఆరోగ్యపరమైన సంపూర్ణ సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.

రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతారు? ఆ టీలో ఏం కలుపుకుంటారు? తదితర అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించారు. అయితే బ్లాక్‌ టీ తాగేవారిలో హృదయ సంబంధ జబ్బులు, రక్తం గడ్డకట్టడం ద్వారా సంభవించే గుండెపోటు, పక్షవాతం తదితర సమస్యలు చాలా తక్కువని గుర్తించారు. బ్లాక్‌ టీ తాగేవారు ఈ ప్రమాదకర సమస్యల కారణంగా మరణించడం కూడా తక్కువేనని పేర్కొన్నారు. టీలో బయోయాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఎక్కువగా ఉంటాయని శరీరంలోని కణజాల వాపు మరియు ఆక్సిజన్‌ కొరత ద్వారా ఏర్పడే ఒత్తిడిని అరికడతాయని పరిశోధకులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -